Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 03

Today in history - చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 03 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 03

Today in history September 3rd

దినోత్సవం

  • ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం

సంఘటనలు

1831 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా “15 నెలల 15 రోజుల కాలం” నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
2009: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.

జననాలు

1893: కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988)
1905: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (మ.1986)
1905: కార్ల్ డేవిడ్ అండర్సన్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991)
1908: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953)
1924: కావూరి పూర్ణచంద్రరావు, అష్టావధాని, గ్రంథరచయిత.
1935: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (మ.2015)
1940: ప్యారెలాల్ ,(సంగీత దర్శకుల ద్యయంలోఒకరు) సంగీత దర్శకుడు.
1952: శక్తికపూర్, భారతీయ భాషల నటుడు, హాస్యనటుడు.
1965: కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్, అమెరికన్ నటుడు.
1971: కిరణ్ దేశాయ్, భారతదేశ రచయిత్రి.
1974: మల్లి మస్తాన్‌ బాబు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. (మ.2015)
1978: అర్జన్ బజ్వా, ఒక భారతీయ సినీ నటుడు.ఎక్కువగా బాలీవుడ్, తెలుగు సినిమాల్లో నటించాడు.
2001: ధీరజ్ బొమ్మదేవర, భారతీయ విలుకాడు. 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ ఆర్చరీ జట్టులో ఉన్నాడు.

మరణాలు

1962: వినాయకరావు కొరాట్కర్, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895)
1969: హొ చి మిన్ వియత్నాం సామ్యవాద నాయకుడు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890)
1987: రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
2011: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ముఖ్యుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
2011: ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, పారిశ్రామిక వేత్త. (జ.1921)

Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →