BIKKI NEWS (SEP. 02) : Teacher and Aya jobs in govt pre primary schools. జగిత్యాల జిల్లాలోని 51 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్ మరియు ఆయా ఉద్యోగాల కోసం ప్రకటన విడుదలైంది.
Teacher and Aya jobs in govt pre primary schools.
ఈ ఉద్యోగాలను పూర్తిస్థాయిలో తాత్కాలిక పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు.
టీచర్ ఉద్యోగానికి అర్హత ఇంటర్మీడియట్ కాగా, ఆయా ఉద్యోగానికి అర్హత ఏడవ తరగతిగా నిర్ణయించారు.
టీచర్ ఉద్యోగానికి గౌరవ వేతనం 8,000/- ఆయా ఉద్యోగానికి గౌరవ వేతనం 6,000/- గా నిర్ణయించారు.
వయోపరిమితి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవడానికి గడువు సెప్టెంబర్ 6 సాయంత్రం 5.00 గంటల వరకు కలదు.
అభ్యర్థులు సంబంధిత మండలంలోని మండల విద్యాధికారి (MEO) కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

