BIKKI NEWS (MAR. 01) : Today In History March 1st – చరిత్రలో ఈరోజు
Today In History March 1st
దినోత్సవం
- ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
- జీరో డిస్క్రిమినేషన్ డే
- స్వీయ గాయం అవగాహన దినోత్సవం
సంఘటనలు
1768: మార్చి 1, 1768లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, 1823లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేసాక అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి. సర్కారులు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమవగా, ప్రస్తుతపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్న ప్రాంతాన్ని గోదావరి జిల్లాగా ఏర్పరిచారు.
1925: గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లాను విడదీసి, 1925 ఏప్రిల్ 15, 1925 లో, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లాగా పేరు మార్చుకొంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది.విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది.
1925:బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు
2008: బంగ్లాదేశ్తో చిట్టగాంగ్లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు
జననాలు
1887: చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (మ.1964)
1901: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్రరాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (మ.1983)
1908: ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకులు. (మ.1986)
1918: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995)
1930: సి.డి.గోపీనాథ్, భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెటర్.
1936: ఉప్పల గోపాలరావు, ఒక సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు. ప్రజా ఆలోచనా వేదిక వ్యవస్థాపకుడు. సంఘసేవకుడు.
1938: యలమంచిలి హనుమంతరావు, ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (మ.2016)
1942: కె.జె.రావు, భారత ఎన్నికల కమిషన్ పరిశీలకులు, బీహార్ లాంటి ప్రమాదకర రాష్ట్రంలో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడు.
1950: షాహిద్ ఇస్రార్, పాకిస్థానీ మాజీ క్రికెటర్ (మ.2013)
1951: నితీశ్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి.
1952: సాగర్(విద్యాసాగర్ రెడ్డి) తెలుగు చలన చిత్ర దర్శకుడు.(2023)
1952: పొన్ రాధాకృష్ణన్, తమిళనాడుకు చెందిన రాజకీయనాయకుడు. లోకసభ సభ్యుడు. కేంద్ర సహాయమంత్రి.
1955: వెలమల సిమ్మన్న, బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, భాషా శాస్త్రవేత్త, విమర్శకులు.
1963: చరణ్‌జిత్ సింగ్ చన్నీ, రాజకీయ నాయకుడు. పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
1969: ఆజం ఖాన్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.
1986: ఎన్. సి. కారుణ్య, పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురిని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు.
1990: అర్చన గుప్తా, దక్షిణాది చిత్రాల నటి.
1992: శరద్ కుమార్, భారతదేశానికి చెందిన పారా ఒలింపిక్ క్రీడాకారుడు.
1993: కామ్ ఫ్లెచర్, న్యూజిలాండ్ క్రికెటర్
మరణాలు
1948: క్లారా కెర్న్ బేలిస్, అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త. (జ.1848)
1989: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్.
1992: శూలమంగళం రాజ్యలక్ష్మి, నేపథ్య గాయని, పాటల రచయిత(జ.1940)
1997: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు.
2010: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం సభ్యుడు. (జ.1931)
- Canara Bank Recruitment 2026 : కెనరా బ్యాంక్‌లో 3,500 అప్రెంటిస్ ఉద్యోగాలు
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్‌మన్ ఉద్యోగాలు

