Today in history – చరిత్రలో ఈరోజు జూలై 20

Today in history - చరిత్రలో ఈరోజు జూలై 20 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు జూలై 20

Today in history July 20th

దినోత్సవం

  • అంతర్జాతీయ చెస్ రోజు
  • అంతర్జాతీయ చంద్ర దినోత్సవం
  • జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం (జూలై మూడవ ఆదివారం)

సంఘటనలు

1773: స్కాట్లాండు నుంచి వలసవచ్చిన వారు కెనడా లోని పిక్టౌ (నొవ స్కాటియా) కి వచ్చారు.
1868: సిగరెట్లమీద మొదటిసారిగా ‘టాక్స్ స్టాంపుల’ ను వాడారు అమెరికాలో.
1871: బ్రిటిష్ కొలంబియా, కెనడా సమాఖ్యలో చేరింది.
1872: అమెరికన్ పేటెంట్ కార్యాలయం, వైర్‌లెస్ టెలిగ్రఫీ మొదటి పేటెంట్ మహ్లాన్ లూమిస్ అనే వ్యక్తికి ఇచ్చింది.
1878: హవాయిలో మొట్టమొదటి టెలిఫోన్ ని ప్రవేశ పెట్టారు.
1903: ఫోర్డ్ మోటార్ కంపెనీ తన మొట్టమొదటి కారును ఎగుమతి చేసింది.


1921: న్యూయార్క్ నగరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఎయిర్ మెయిల్ సర్వీస్ మొదలైంది.
1930: వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్).
1934: అయొవా రాష్ట్రం రికార్డు. అయొవా రాష్ట్రంలో ఉన్న ‘కియోకుక్’ లో 118 డిగ్రీల ఫారెన్ హీట్ (48 డిగ్రీల సెంటిగ్రేడ్).
1935: లాహోర్ లోని మసీదు విషయమై ముస్లిములకు, సిక్కులకు జరిగిన అల్లర్లలో, 11 మంది మరణించారు.
1944: రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు.
1947: ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని ‘యు. సా’ ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1947: 1947 జూలై 19 న జరిగిన అభిప్రాయ సేకరణలో చాలా ఎక్కువ ఓట్లతో, వాయవ్య సరిహద్దు ప్రాంతం ప్రావిన్స్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) ప్రజలు, భారతదేశంలో కంటే, పాకిస్తాన్ లోనే చేరటానికి, తమ సమ్మతిని తెలిపారని, భారతదేశపు వైస్రాయి 1947 జూలై 20 తేదీన, చెప్పాడు.


1960: సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి).
1960: రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే.
1962: కొలంబియాలో జరిగిన భూకంపంలో 40మంది మరణించారు.
1969: భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి పదవీ విరమణ.
1969: భారత రాష్ట్రపతిగా ఎం.హిదయతుల్లా పదవిని స్వీకరించాడు.
1974: టర్కీ సైన్యం సైప్రస్ మీద దాడి చేసింది.
1975: ‘ది టైమ్స్’, ‘ది డెయిలీ టెలిగ్రాఫ్’, ‘న్యూస్ వీక్’ పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి – ఎమెర్జెన్సీ కాలం)


1976: ‘వైకింగ్ 1’ అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ ‘వైకింగ్ 1’ ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద ‘క్రిస్ ప్లానిటియా’ అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది.
1976: అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది)
1989: బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు ‘దా అంగ్ సాన్ సూ క్యి’ ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు.
1990: లండన్ స్టాక్ ఎక్షేంజ్ పై ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ బాంబు పేల్చింది.

జననాలు

1785: మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు.
1822: గ్రెగర్ జాన్ మెండెల్, ఆస్ట్రియా సన్యాసి, వృక్షశాస్త్రజ్ఞుడు. ‘లాస్ ఆఫ్ హెరెడిటీ’ జీవుల అనువంశికత సూత్రాలు కనుగొన్నాడు.
1864: ఎరిక్ కార్ల్‌ఫెల్డ్, స్వీడన్. కవి. ( 1918 లో నోబెల్ బహుమతి తిరస్కారము. 1931 లో నోబెల్ బహుమతి మరణానంతరం ఇచ్చారు).
1892: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (మ.1969)
1919: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాడు. (మ.2008)
1920: లెవ్ అరోనిన్, యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు (1950)
1933: రొద్దం నరసింహ, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత.
1941: వ్లాదిమిర్ ఎ ల్యాఖోవ్, రోదసీ యాత్రికుడు (సోయుజ్ 32, టి-9)
1947: గెర్డ్ బిన్నింగ్ ఫ్రాంక్‌ఫర్ట్, ఫిజిసిస్ట్ (టన్నెలింగ్ సూక్ష్మదర్శిని – నోబెల్ బహుమతి గ్రహీత 1986)
1968: ఎస్.జె.సూర్య , తమిళ, తెలుగు, చిత్రాల నటుడు,దర్శకుడు , రచయత, సంగీత దర్శకుడు,గాయకుడు.
1969: గిరిజా షెత్తర్, తెలుగు సినిమా నటి.
1980: గ్రేసీ సింగ్, భారతీయ సినీనటి , భరత నాట్యం, ఒడిస్సీ, నృత్య కారిణి.
1983: వేణు ఊడుగుల, తెలుగు సినిమా దర్శకుడు.

మరణాలు

1937: గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874)
1951: జోర్డాన్ రాజు, అబ్దుల్లా ఇబిన్ హుస్సేన్, ని జెరూసలెంలో హత్య చేసారు.
1972: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930)
1973: బ్రూస్ లీ, ప్రపంచ యుద్ధ వీరుడు. (జ.1940)
1980: పర్వతనేని బ్రహ్మయ్య, పేరొందిన అకౌంటెంట్. (జ.1908)
2015: టి.కనకం, అలనాటి చలనచిత్ర హాస్యనటి, రంగస్థల నటి, గాయనీ.(జ.1927)
2019: షీలా దీక్షిత్, దేశ రాజధాని ఢిల్లీకి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.(జ. 1938)
2023: చిలుకూరి రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ. 1944)
2024: జెడింగీ, పులిని గొడ్డలితో చంపిన మిజోరాం ధీర వనిత, శౌర్యచక్ర పురస్కార గ్రహీత.[1] బంగ్లాదేశ్కు చెందిన ఆమె ఇరవై ఆరేళ్ల వయసులో వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్ళింది. అక్కడ, తనపై దాడికి సిద్ధమైన పులిని చేతిలోని గొడ్డలితో నరికి చంపింది. ఈ సంఘటన 1978 జులై 3న జరిగింది.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →