Today in history january 11th – చరిత్రలో ఈరోజు జనవరి 11

Today in history january 11th

BIKKI NEWS (JAN. 11) : Today in history january 11th – చరిత్రలో ఈరోజు జనవరి 11

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history January 11th

దినోత్సవం

  • జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

సంఘటనలు

1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.
1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు 1 నుంచి 1960 జనవరి 11 వరకు).
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు).

జననాలు

1866: మాబెల్ బార్ల్ట్రోప్, బ్రిటిష్ స్థాపకురాలు
1968: శ్రీనివాస్ రామడుగుల, కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు
1970: సుకుమార్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత
1973: రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు
1981: కిరణ్ రాథోడ్, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల నటి.
1991: శ్వేతా బసు ప్రసాద్, భారతీయ చలనచిత్ర నటి

మరణాలు

1966: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (జ.1904)
1983: భారతపారిశ్రామిక వేత్త, విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా (జననం.1894)
2008: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919)
2012: వీరమాచనేని మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు (జ.1923)
2013 : ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.
2013: ఖుషి మురళి, నేపథ్య గాయకుడు. (జ. 1963)
2016: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (జ.1936)
2016: పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (జ.1927)
2021: తుర్లపాటి కుటుంబరావు, పాత్రికేయుడు, రచయిత, వక్త. (జ. 1933)
2021: దుగ్యాల శ్రీనివాస రావు, మాజీ శాసనసభ్యుడు.
2022: టీవీ నారాయణ, విద్యావేత్త, పద్మశ్రీ పురస్కారగ్రహీత. (జ.1925)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →