Today in history September 30th – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 30

Today in history by bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 30

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history September 30th

దినోత్సవం

  • అంతర్జాతీయ అనువాద దినోత్సవం.
  • అంతర్జాతీయ Podcast దినోత్సవం.

సంఘటనలు

1667 – గోల్కొండ ఔరంగజేబు సామ్రాజ్యంలో విలీనం చేయబడింది.
1947: పాకిస్థాన్ ఇంకా యెమన్ ఐక్యరాజ్యసమితిలో చేరాయి.
1955: రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది.
1971: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు.
1993: మహారాష్ట్ర లోని లాతూర్ భూకంపం, సుమారు 10,000 ప్రజలు మరణించారు.
2001 – మధ్యప్రదేశ్, మెయిన్‌పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియాతో సహా మొత్తం 8 మంది మరణించారు.
2007 – మెక్సికోలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా భారతీయ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ కొత్త ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.
2008: రాజస్థాన్ లోని జోధ్‌పూర్లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
2010: అయోధ్యలోని బాబ్రీ మసీదు రామ మందిర వివాదంపై ప్రయాగ్‌రాజ్ హైకోర్టు యొక్క లక్నో బెంచ్, ఆ వివాదాస్పద నేలను మూడు ముక్కలుగా వేరు చేసి, రామ్ లల్లా, నిర్మోహి అఖారా, వక్ఫ్ బోర్డులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చింది.
2012: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చి (కవాతు) జరిగింది.
2020: బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా, సంఘ్ అగ్రనాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది

జననాలు

1207: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ. (మ.1273)
1828: లాహిరి మహాశయులు, భారత యోగీశ్వరుడు, మహావతార్ బాబాజీకి శిష్యుడు. (మ.1895)
1864 – స్వామి అకందానంద, స్వామి రామకృష్ణ శిష్యుడు (మ. 1937 )
1893: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. (మ.1965)
1900: ఎం. సి. చగ్లా, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి (మ. 1981 )
1913: ఆర్. రామనాథన్ చెట్టియార్, తమిళనాడు రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త (మ. 1995 )
1922: హృషీకేష్ ముఖర్జీ, బెంగాలీ-హిందీ సినిమాల దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ. 2006)
1934: అన్నా కష్ఫి, భారత-అమెరికన్ నటీమణి (మ. 2015)
1941: కమలేశ్ శర్మ, భారత దౌత్యవేత్త, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్‌
1951: రేలంగి నరసింహారావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు, హాస్య చిత్రాలకు ప్రసిద్ధి.
1961: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1966 – శంకర్ బాలసుబ్రమణియన్, భారతీయ-బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త
1967: దీప్తి భట్నాగర్, భారతీయ సినీ నటీ, మోడల్, టీ వి.వ్యాఖ్యత .
1964: మోనికా బెల్లూచి ఇటలీ నటి, ఫ్యాషన్ మోడల్ జననం.
1970:దీపా మాలిక్, భారత క్రీడాకారిణి.
1972: శాంతను ముఖర్జీ (షాన్), పేరుగాంచిన భారత గాయకుడు.
1980: మార్టినా హింగిస్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి.
1993: అకీరా పీటర్స్, వెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారిణి.

మరణాలు

1955: జేమ్స్ డీన్, అమెరికాకు చెందిన నటుడు (జ.1931).
1990: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు సుప్రసిద్ధ నవలా రచయిత (జ.1954).
2001: మాధవరావు సింధియా, రాజకీయ నాయకుడు (జ.1945).
2012: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు (జ.1923).
2014: మౌల్వి ఇఫ్తిఖర్ హుస్సేన్ అన్సారీ, భారత మతగురువు, రాజకీయ నాయకుడు. (జ.1940).

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →