Today in history December 30th – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 30

Today in history december 30th

BIKKI NEWS :Today in history December 30th – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 30

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history December 30th

సంఘటనలు

1906: భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు.
1922: రష్యన్‌ సోవియట్‌ ఫెడరేషన్‌, ట్రాన్స్‌కకేషియన్‌, ఉక్రేనియన్‌, బెలారసియన్‌ సోవియట్‌ రిపబ్లిక్‌లు నాలుగూ కలిసి ద యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌గా ఏర్పడ్డాయి.
1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు.
1985: తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసింది.
2003: శ్రీజయ ఆర్ట్స్ సంస్థను హైదరాబాద్ లో ఇదేరోజున సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాధినేని గారు స్థాపించారు. ఈ సంస్థలో కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ నటులుగా తీర్చి దిద్దుతున్నారు. అలాగే శ్రీజయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు.
2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.
2008: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.
2009: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.

జననాలు

1865: రుడ్యార్డ్ కిప్లింగ్, ఆంగ్ల రచయిత, కవి. (మ.1936)
1879: రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది “మౌనము” లేదా “మౌనముద్ర”. వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు
1887: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు
1898: యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో 1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,
1935: మాన్యువెల్ ఆరన్ భారతదేశపు చదరంగం ఆటగాడు.
1944: అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(మ.2024)
1946: మాక్సిన్ శాండర్స్
1948: సురీందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్.
1968: సబీర్ భాటియా హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు సహ-వ్యవస్థాపకుడు.
1984: లెబ్రాన్ జేమ్స్ అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు.

మరణాలు

1955: వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895)
1971: విక్రం సారాభాయ్‌, శాస్త్రవేత్త.
1973: చిత్తూరు నాగయ్య, తెలుగు సినిమా నటుడు.(జ.1904)
1992: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు.
2006: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (జ.1918)
2009: విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో సహాయ పాత్రల నటుడు.(జ.1950)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →