Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 13

Today in history december 13

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 13

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history December 13th

దినోత్సవం

  • జాతీయ బుద్ధి మాంద్యంల దినం

సంఘటనలు

2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
1865 : శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు.
1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
1989 : మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ ‘ఎస్సెల్‌ వరల్డ్‌’ ముంబయిలో ప్రారంభమైంది.
1999 : ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు.
2000 : భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌.
2002 : ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు.

జననాలు

1835: పటాని సమంత్, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త (మ.1904)
1894: బసవరాజు అప్పారావు, కవి. భావకవితాయుగంలోని కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాడు (1933).
1911: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవిల్మొ (మ.1999).
1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పనిచేశాడు [మ. 2010].
1952: యెర్రగుడిపాటి లక్ష్మి, దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది.
1960: దగ్గుపాటి వెంకటేష్, సినీ నటుడు.
1981: ఏమీ లీ, అమెరికన్ గాయని-గేయ రచయిత్రి, పియానిస్ట్.
1984: మధు శర్మ, చలన చిత్ర నటి, నిర్మాత .
1989: టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి.
1988: రెజీనా, తెలుగు, తమిళ, కన్నడ నటి..

మరణాలు

1973: బారు అలివేలమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1897).
1977: బెహరా కమలమ్మ, “తనుమధ్యాంబ” పీఠానికి వారసురాలు (జ.1904).
1986: స్మితా పాటిల్, హిందీ సినీనటి (జ.1955).
1994: నీలం రాజశేఖరరెడ్డి, భారతీయ కమ్యూనిస్టు నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు (జ.1918).
2007: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)
2016: కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1922)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →