Today in history August 3rd – చరిత్రలో ఈరోజు ఆగస్టు 03

Today in history august 3rd - చరిత్రలో ఈరోజు ఆగస్టు 03 - bikki news

BIKKI NEWS : Today in history August 3rd – చరిత్రలో ఈరోజు ఆగస్టు 03

Today in history August 3rd

దినోత్సవం

  • ప్రపంచ స్నేహితుల దినోత్సవం (ఆగస్టు మొదటి ఆదివారం)
  • జాతీయ పుచ్చకాయ దినోత్సవము

సంఘటనలు

1777: మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ని ప్రారంభించారు.
1858: విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు
1907: పోర్చుగల్లో ఆదివారం విశ్రాంతి దినంగా పేర్కొంటూ, రాజాజ్ఞ జారీ అయ్యింది.
1914: కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది
1957: తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలేషియా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు.
1958: మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్ అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది.
1978: ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్‌వెల్త్ గేమ్స్ని కెనడా లోని ఎడ్మంటన్ లో ప్రారంబింది.
1990: నెయిల్‌స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రతగా బ్రిటన్లో నమోదు చేసింది. 1911లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్‌హీట్ అధికంగా రికార్డు అయింది.
2003: అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు.

జననాలు

1656: కాకునూరి అప్పకవి, తెలుగు లాక్షణిక కవి. ‘ఆంధ్రశబ్ద చింతామణి ‘ ఆధారంగా ‘ఆంధ్రశబ్దచింతామణి ‘ అను ఛందో గ్రంథానికి రచయిత.
1886: మైథిలీ శరణ్ గుప్త, హిందీ రచయిత (మ.1964)
1913: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013)
1921: లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ – మార్క్సిస్టు నాయకుడు. (మ.2003)
1931: సూరి బాలకృష్ణ, భూ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త (మ.1984)..
1948: వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినినటి.
1956: టి. మీనాకుమారి, న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.
1983: ఆషీమా భల్లా , హిందీ, కన్నడ, తెలుగు, తమిళ, అస్సామీ చిత్రాల నటి .
1989: గౌరినంద , మలయాళం, తెలుగు, తమిళ చిత్రాల నటి.

మరణాలు

2008: పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి.
2011: వేగుంట మోహనప్రసాద్, కవి, రచయిత. (జ.1942)
2013: ప్రియంవద, తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు. (జ.1928)
2013: ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి, మాజీ మంత్రి, రాజకీయ కురువృద్దుడు. (జ.1933)
2017 : జీడిపల్లి విఠల్ రెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ తొలి శాసనసభ్యుడు.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →