Today in history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 19

Today in history - చరిత్రలో ఈరోజు ఆగస్టు 19 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు ఆగస్టు 19

Today in history August 19th

దినోత్సవం

  • ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం
  • ప్రపంచ మానవత్వపు దినోత్సవం
  • ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యదినోత్సవం

సంఘటనలు

1944: రెండవ ప్రపంచ యుద్ధము: పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగింది.
1956: కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. (1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు)
1960: స్పుత్నిక్ ప్రోగ్రాం : స్పుత్నిక్ 5ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.
2007: ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నారాయణదత్ తివారీ నియమితుడయ్యాడు.
2011: ప్రణాళికా సంఘం, ఏప్రిల్ 2012 నుంచి మొదలయ్యే, 12వ పంచవర్షప్రణాళిక లక్ష్యము 9 శాతం అభివృద్ధిగా పెట్టుకున్నట్లు ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు ప్రకటించాడు. వ్యవసాయం అభివృద్ధి లక్ష్యం 4 శాతం అని చెప్పాడు. 11వ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగం లక్ష్యం 4 శాతమైనా, ఆ లక్ష్యాన్ని చేరలేకపోయామని, అయినా, వ్యవసాయరంగం మెరుగు గానే ఉంది అని చెప్పాడు.
2011: దేశీయ పరిఙ్ఞానంతో తయారైన స్టెల్త్ (శత్రువుల రాడార్కు ఆచూకీ దొరకని) యుద్ధనౌక ఐ.ఎన్‌.ఎస్. సాత్పుర శనివారం, భారత నౌకాదళంలో చేరింది. శివాలిక్ తరగతి కింద నిర్మిస్తున్న ఫ్రిగేట్ యుద్ధనౌకల్లో సాత్పుర రెండవది. ఐ.ఎన్.ఎస్.శివాలిక్ మొదటి యుద్ధనౌక. చూడు

జననాలు

1918: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి. (మ.1999)
1923: కొత్తపల్లి పున్నయ్య, న్యాయవాది, రాజకీయ నాయకుడు, కవి.
1925: అట్లూరి పుండరీకాక్షయ్య, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, నటుడు. (మ.2012)
1946: బిల్ క్లింటన్, అమెరికా మాజీ (42వ) అధ్యక్షుడు.
1946: డాన్ స్టీల్, అమెరికా నిర్మాత
1972: మురళీ శర్మ , తెలుగు చలన చిత్ర సహాయ పాత్రల నటుడు.
1997: డాన్ స్టీల్, అమెరికన్ ఫిల్మ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్, నిర్మాత.

మరణాలు

0014: ఆగస్టస్, రోమన్ చక్రవర్తి మరణించాడు (జ.63 బి.సి) ఇతని పేరున, ఆగష్టు నెల ఏర్పడింది.
1662: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1623)
1987: సచిన్ నాగ్, 1951 ఆసియా క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం తెచ్చిపెట్టిన ఈతగాడు. (జ.1920)
1994: లీనుస్ పాలింగ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901)
2020: పి.సి.నరసింహారెడ్డి, భాషాశాస్త్రవేత్త, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.(జ.1943)
2015: పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →