Today in history August 13th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 13.

Today in history august 13th - చరిత్రలో ఈరోజు ఆగస్టు 13. - bikki news

BIKKI NEWS : Today in history August 13th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 13.

Today in history August 13th

దినోత్సవం

  • ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం
  • సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిచ్ స్వాతంత్ర్య దినోత్సవము.

సంఘటనలు

3114 బి.సి : మాయా కేలండర్ మొదలైన రోజు. మాయా నాగరికత అమెరికాలో వెల్లివిరిసింది
0533 : పోప్ జాన్-I ఎన్నికయాడు.
0554 : బైజాంటియమ్ చక్రవర్తి అయిన, జస్టినియాన్, ఇటలీ దేశ పునర్నిర్మాణం ప్రారంభించాడు.
0900 : లోరైన్ల రాజు అయిన జ్వెండిబోల్డ్ యుద్ధంలో మరణించాడు.
1099: పాస్చల్ II, పోప్గా ఎన్నికయ్యాడు.
1422: రెచుయెల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్ బోర్న్ అనే పుస్తకాన్ని,విలియం కాక్స్‌టన్, అనే ఇంగ్లీష్ ముద్రాపకుడు, ఇంగ్లీషు భాషలో, మొదటిసారిగా ముద్రించాడు.
1438: జాన్ నైడెర్, తత్వవేత్త, మరణం 1521: స్పానిష్ విజేత హీర్నాందో కోర్టేజ్, అజ్టెక్ ఇండియన్లు నుండి ఇప్పటి మెక్సికో నగరాన్ని, స్వాధీనం చేసుకున్నాడు. వారి నాయకుడు టెనోక్టిట్లాన్.

1587: వర్జీనియా లోని రోనోక్కి చెందిన, మాంటియో అనే మొదటి అమెరికా ఆదివాసి, ఇంగ్లాండ్ చర్చి లోకి, ఒక ప్రొటెస్టంట్గా మతం స్వికరించాడు (మొదటి మత మార్పిడి అమెరికాలో). సర్ వాల్టర్ రాలీ యొక్క “న్యూ వరల్డ్ యాత్ర” లోని సభ్యుల ద్వారా, అతని మత మార్పిడి జరిగింది.
1642: క్రిస్టియాన్ హుయ్గేన్స్, కుజగ్రహపు దక్షిణ ధ్రువం పైన ఉన్న శిఖారాన్ని (కేప్) గుర్తించాడు.
1654: ఫోల్లి జంతువుల మధ్య, మొదటి, రక్త మార్పిడి చేసాడు.
1846: అమెరికా జెండాను లాస్ ఏంజిల్స్లో మొదటిసారి ఎగరవేసారు.
1868:పెరూ, ఈక్వెడార్, బొలీవియా దేశాలలో భూకంపం, సునామీ వచ్చి 25,000 మంది మరణం. 300 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం
1889: నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి, విలియం గ్రే పేటెంట్ తీసుకున్నాడు.

1900 సంఘటనలు


1907: మొదటి టాక్సికేబ్ (అద్దెకారు), న్యూయార్క్ నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది.
1912: మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, ఫిలడెల్ఫియా లోని సెయింట్ జోసెఫ్ కళాశాలకు మంజూరు చేసింది.
1913: స్టెయిన్‌లెస్ స్టీల్ని హారీ బ్రియర్లీ కనుగొన్నాడు.
1923: టర్కీ అధ్యక్షుడుగా ముస్తఫా కెమల్ ఎన్నికయ్యాడు.
1930: కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్, న్యూయార్క్ నుంచి, లాస్ ఏంజిల్స్ వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి, గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.
1942: వాల్ట్ డిస్నీ యొక్క యానిమేటెడ్ ఫీచర్ బాంబి, న్యూయార్క్ నగరంలోని, రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో ప్రదర్శించారు.
1960: మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ “ఎకో వన్ ఉపగ్రహం సాయంతో జరిగింది.
1961: బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.
1985: పోప్ జాన్ పాల్ II, కెమరూన్లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన, అమెరికా, యూరప్ ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు.
1987: బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది
1990: ఇరాక్, కువాయిట్ని ఆక్రమించినందుకు, అమెరికా అధ్యక్షుడు బుష్, డిఫెన్స్ సెక్రటరీ డిక్ చెనీ ని, రెండవ సారి పెర్షియన్ గల్ఫ్ కు పంపాడు. సౌదీ అరేబియా లోని అమెరికన్ సైనిక దళాలు సుదీర్ఘ కాలం ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు.
1990: కువైట్ నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీలు, వస్తువులు, ఇరాక్ బంగారం మార్కెట్ లో (బులియన్) లో $ 3 బిలియన్, $ 4 బిలియన్ మధ్య బదిలీ చేసినట్లు గా, లండన్ లోని అరబ్ బ్యాంకర్లు నివేదించారు
1994: హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్ (పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది

2000 సంఘటనలు


2004: 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్లో ప్రారంభమయ్యాయి.
2005: బురుండి లోని గతుంబ హత్యాకాండ (ఊచకోత) ను కార్యకర్తలు గుర్తుతెచ్చుకున్నారు.
2006: నెదర్లాండ్స్లో H5N1 బర్డ్ ఫ్లూని ధ్రువీకరించారు
2006: దావానలం, స్పెయిన్లో కొనసాగుతుంది
2006: అంతర్జాతీయ ఎయిడ్స్ సమావేశం, టొరంటోలో ప్రారంభమయ్యింది.
2007: అమెరికా దానశీలి, పరోపకారి బ్రూక్ ఏస్టర్ తన 105వ ఏట మరణించాడు
2007: భారతదేశం ఇంగ్లాండ్ మీద టెస్ట్ క్రికెట్ సిరీస్ లో విజయం పొందింది.
2007: ఉత్తర అర్థగోళంలో కనిపించే వార్షిక పెర్సెయిడ్స్ ఉల్కాపాతం
2007: ప్రపంచ డెఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్- డే 1: యూరోపియన్ ఈతగాళ్ళు పెరుగుతున్నారు.
2008: చైనా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల లోని కొంతభాగం మోస పూరితమని, అధికారులు, అంగీకరించారు.
2008: ఒలింపిక్ ముఖ్యాంశాలు: 2008 ఆగష్టు 13
2009: భారతదేశం H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి ముంబైలో మూసివేతలు ప్రారంభించింది.
09: మహిళా బాక్సింగ్ ను మొదటిసారి 2012 ఒలింపిక్స్ లో చేర్చేందుకు నిర్ణయించారు.
2009: బ్రిటన్ లో నిరుద్యోగ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగింది.
2011: రాఖీ పండుగ; జంధ్యాల పౌర్ణమి; శ్రావణ పౌర్ణమి; సింహాచలం అప్పన్నకు కరాళచందనం సమర్పించే రోజు.

జననాలు

1655: జోహన్ క్రిస్తోఫ్ డెన్నెర్, క్లారినెట్ను కనుగొన్న శాస్త్రవేత్త.
1818: లూసీ స్టోన్, సంఘ సంస్కర్త.
1841: జానీ ములాగ్, ఆస్ట్రేలియా దేశపు తొలితరం క్రికెట్ క్రీడాకారుడు. (మ.1891)
1860: అన్నీ ఓక్లే, షార్ప్ షూటర్.
1888: జాన్ బైర్డ్, టెలివిజన్ సాంకేతిక విజ్ఞానానికి మార్గదర్శకం చేసిన స్కాటిష్ శాస్త్రవేత్త (మ.1946).
1899: ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్, సినిమా దర్శకుడు, మాస్టర్ ఆఫ్ సస్పెన్స్గా ప్రఖ్యాతుడు (మ.1980).
1925: ఎస్.వరలక్ష్మి, తెలుగు సినీ నటి,గాయని (మ.2009)
1926: ఫిడేల్ కాస్ట్రో రుజ్, క్యూబా దేశపు విప్లవకారుడు, నియంత (మ.2016).
1933: వైజయంతి మాల, హిందీ,తెలుగు,తమిళ, సినీ నటి, నర్తకి, పార్లమెంట్ సభ్యురాలు .
1934: ఎక్కిరాల వేదవ్యాస, ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు (మ. 2014)..
1952: ప్రతాప్ పోతన్, తెలుగు తమిళ, హిందీ, మలయాళ, చిత్రాల నటుడు, నిర్మాత, దర్శకుడు. (మ.2022)
1952 : హిందీ చలనచిత్ర నటీమణి యోగీతా బాలీ జననం.
1954: రేణుకా చౌదరి, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి.
1963: శ్రీదేవి, సినిమా నటి (మ. 2018).
1970: అలన్ షేరర్, ఇంగ్లీష్ ఫుట్‌బాల్ ఆటగాడు. ఇంగ్లాండు జాతీయజట్టులో స్ట్రైకర్‌గా ఆడాడు.
1974: సూర్యకిరణ్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత. (మ.2024)
1975: షోయబ్ అక్తర్, పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు.
1986: అజయ్ భూపతి, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత

మరణాలు

1910: ఫ్లారెన్స్ నైటింగేల్, సమాజ సేవకురాలు, నర్సు. (జ.1820)
1936: భికాజి కామా, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1861)
1978: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (జ.1896)
1988: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి…) రచయిత. (జ.1916)
1994: రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1937)
2005: స్నిపర్, శ్రీలంక యొక్క విదేశాంగ మంత్రి.
2007: మీనా కుమారి, తెలుగు చలన చిత్ర నటి.
2008: శాండీ అల్లెన్ Archived 2011-08-10 at the Wayback Machine, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7′ 7 1/4″ (232 సెంటిమీటర్లు), (జ.1955)
2009: కార్ల్ వాన్ హేస్స్, అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్.
2018: సోమనాథ్ చటర్జీ, లోక్‌సభ మాజీ సభాపతి, కోల్‌కత్తాలో చనిపొయారు (జ. 1929).

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →