Today in history August 12th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 12

Today in history august 12th - చరిత్రలో ఈరోజు ఆగస్టు 12 - bikki news

BIKKI NEWS : Today in history August 12th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 12

Today in history August 12th

దినోత్సవం

  • ప్రపంచ ఏనుగుల దినోత్సవం
  • అంతర్జాతీయ యువజన దినోత్సవం
  • జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే)

సంఘటనలు

1851: ఇసాక్ సింగర్ కనిపెట్టిన కుట్టు మిషన్కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, బోస్టన్లో వ్యాపారం మొదలుపెట్టాడు.
1936: ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, (ఏ.ఇ.ఎస్.ఎఫ్. – అఖిల భారత విద్యార్థిసమాఖ్య), ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో స్థాపించబడింది.
1976: లండన్ లోని నేషనల్ థియేటర్ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.
1978: ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా అవతరించింది.
2009: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
2010: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగా వస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
2010: రంజాన్ భారతదేశంలో ఈ సంవత్సరంలో నేటితో ప్రారంభమవుతుంది
2011: విశాఖపట్నం బార్ అసోసియేషన్ కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.

జననాలు

1892: ఎస్.ఆర్.రంగనాథన్, భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.1972). ఇతడి పుట్టినరోజుని, భారతదేశం, జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించింది.
1892: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1975)
1909: రాజేశ్వర్ దయాళ్, భారతీయ దౌత్యవేత్త, రచయిత. (మ.1999)
1919: విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971)
1930: జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి,, రాజకీయ ఉద్యమకారుడు.
1939: సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016)
1965: పల్లెర్ల రామ్మోహనరావు, కళాకారుడు, భజన కీర్తనల రచయిత.
1997: సాయేశా సైగల్, తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటి

మరణాలు

30 బి.సి: క్లియోపాత్ర, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాలో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది (జ. 69 బి.సి.). ఈమెను ప్రపంచ సుందరిగా పిలుస్తారు.ఈజిప్ట్ మహారాణి
1944: కైవారం బాలాంబ, అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు (జ.1849).
1945: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878).
2009: మల్లవరపు జాన్, తెలుగు కవి (జ.1927).
2022: అన్షు జైన్ భారత సంతతికి చెందిన బ్యాంకర్‌. బ్రిటిష్ వ్యాపార కార్యనిర్వాహకుడు. (జ.1963)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →