Library day - జాతీయ గ్రంథాలయ దినోత్సవం - bikki news

Library Day – జాతీయ గ్రంథాలయ దినోత్సవం

BIKKI NEWS (AUG. 12) : LIBRARY DAY AUGUST 12th. జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 12వ తేదీన భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు.

LIBRARY DAY AUGUST 12th.

భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

లెక్కల ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ 1923లో మద్రాసు యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా చేరాడు. తనకు దొరికిన ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, 1924లో క్లాసిఫికేషన్‌, 1933లో గ్రంథాలయ కేటలాగుల్ని తయారుచేయడానికి ఒక కొత్త కోడ్‌ను రూపొందించాడు. కోలన్ క్లాసిఫికేషన్ అని పిలిచే ఈ వర్గీకరణ పద్ధతిని దేశంలోని అనేక గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి.

భారతదేశంలో అకడమిక్‌ లైబ్రరీలతోపాటు, పబ్లిక్‌ లైబ్రరీలలో అభివృద్ధికి, గ్రంథాలయ వ్యవస్థ వికాసానికి విశేషంగా కృషి చేసిన ఎస్.ఆర్ రంగనాథన్ పుట్టినరోజైన ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నారు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →