HEAVY RAINS – ఈరోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

BIKKI NEWS (AUG. 25) : Today heavy rains falling districts in AP and TG. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపింది.

Today heavy rains falling districts in AP and TG.

ఈ అల్ప పీడన ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరికొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు ‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు శ్రీకాకుళం, విజయనగరంలో రేపు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరిలో భారీ వర్షాలు, ఇతర చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేసింది.

మరోవైపు తెలంగాణ లోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ లలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.