BIKKI NEWS (FEB. 27) : TELANGANA VIDYA COMMISSION REPORT 2026 HANDOVER TO CM. తెలంగాణ విద్యా కమిషన్ అందించిన నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన అంశాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, ఆ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు గారి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు.
TELANGANA VIDYA COMMISSION REPORT 2026 HANDOVER TO CM
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారితో పాటు కమిషన్ సభ్యులు తెలంగాణ విద్యా విధానంపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి గారికి సమర్పించారు.
అమెరికా, వియత్నాం, మలేసియా వంటి దేశాల్లో స్వయంగా పర్యటించడంతో పాటు వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాలను పరిశీలించి నివేదిక రూపొందించినట్లు ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి గారికి నివేదికలోని అంశాలను సుదీర్ఘంగా వివరించారు. నివేదికలోని అంశాలను తెలుసుకున్న అనంతరం ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, డాక్టర్ కె కేశవరావు గారు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి గారు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి గారు, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి గారు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి గారు, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మొలుగారం కుమార్ గారు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు, విద్యా కమిషన్ సభ్యులు, విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
