Intermediate board - ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా శ్రీదేవసేన - bikki news

INTERMEDIATE BOARD – ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా శ్రీదేవసేన

BIKKI NEWS (APRIL 24) : Telangana Intermediate board Incharge director sri Devasena. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా శ్రీదేవసేనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ మరియు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీగా ఉన్న శ్రీ ఎస్. కృష్ణ ఆదిత్య, IAS, సుదీర్ఘ సెలవుపై వెళ్తున్న నేపధ్యంలో రు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను (G.O.Rt.No.460) విడుదల చేసింది.

Telangana Intermediate board Incharge director sri Devasena

​కృష్ణ ఆదిత్య వ్యక్తిగత కారణాలతో అమెరికా (USA) వెళ్లేందుకు ‘ఎక్స్-ఇండియా ఎర్న్డ్ లీవ్’ (Ex-India Earned Leave) కోరగా, ప్రభుత్వం అందుకు అనుమతినిచ్చింది.

శ్రీ దేవసేన ఏప్రిల్ 25, 2026 నుండి జూన్ 10, 2026 వరకు (మొత్తం 47 రోజులు) పాటు ఇంటర్ విద్యా మండలి ఇంచార్జీ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు

కృష్ణ ఆదిత్య సెలవులో ఉన్న సమయంలో ఆ బాధ్యతలను నిర్వహించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీమతి ఎ. శ్రీదేవసేనను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె సాంకేతిక విద్యాశాఖ (Technical Education) కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ మరియు డైరెక్టర్ బాధ్యతలను పూర్తి అదనపు బాధ్యత (FAC) కింద అప్పగించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →