Inter new books - విడుదల ఆలస్యం - bikki news

INTER NEW BOOKS – విడుదల ఆలస్యం

హైదరాబాద్ (ఏప్రిల్ 12) : Telangana Inter new books release date postponed. తెలంగాణ ఇంటర్మీడియట్ నూతన పాఠ్య పుస్తకాల ఆవిష్కరణ వాయిదా పడినట్లు సమాచారం. ఇంటర్మీడియట్ ఫలితాలతో పాటు నూతన పాఠ్యపుస్తకాలను కూడా విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు విశ్వసనీయ సమాచారం.

Telangana Inter new books release date postponed.

2025 – 26 విద్యా సంవత్సరంలోనే నూతన పాఠ్య పుస్తకాలను ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ సమయాభావం వలన 2026 – 27 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలో నూతన పాఠ్య పుస్తకాలను ప్రవేశ పెట్టాలని ఇంటర్మీడియట్ బోర్డు తీవ్ర కృషి చేసి పుస్తకాల ముద్రణను కూడా పూర్త చేసింది.

అయితే పాత సిలబస్ కు నూతన సిలబస్ కు ఉన్న ప్రధాన తేడాలను మరోసారి సూచించాలని ప్రభుత్వం నుంచి సమాచారం కోరడంతో పాఠ్యపుస్తకాల విడుదలలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా సైన్స్ పుస్తకాలలో దాదాపు 30 శాతం వరకు సిలబస్ ను కుదించి నూతన పాఠ్య పుస్తకాలను జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా తీర్చి దిద్దిన సంగతి తెలిసిందే.

నూతన విద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమైన మొదటి రోజునే పాఠ్యపుస్తకాలు ఉండాలనే ద్యేయంతో, అకుంఠీత దీక్షతో పాఠ్యపుస్తకాల సిలబస్ రూపకల్పన, ముద్రణ వంటివి ముందస్తుగానే పూర్తి చేసింది ఇంటర్మీడియట్ బోర్డ్ .

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →