Swaccha Bharat – మేరా యువ భారత్ వేదిక యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి – ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్

Swaccha bharat at gjc boys husnabad

BIKKI NEWS (SEP. 17) : Swaccha Bharat at GJC Boys Husnabad. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన వికసిత్ భారత్ లో భాగంగా మైభారత్ సేవా పక్వాడ వేదిక యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని హుస్నాబాద్ బాలుర కళాశాల ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్ పేర్కొన్నారు.

Swaccha Bharat at GJC Boys Husnabad

సిద్ధిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి ఆదేశానుసారం ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాలలో గురువారం నిర్వహించిన మైభారత్ సేవా పక్వాడ, పచ్చదనం-పరిశుభ్రత, స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ, వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (విబివైఎల్ డి) 2027 కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సాగే పక్షోత్సవాలలో స్వచ్ఛభారత్, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తుందని, విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకొని భాగస్వాములు కావాలని కోరారు.

అనంతరం విద్యార్థులు, అధ్యాపకులచే స్వచ్ఛత శ్రమదాన్ వికసిత్ భారత్ సంకల్ప ప్రతిజ్ఞను చేయించారు. మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ పై అవగాహన కల్పించారు.

అనంతరం కళాశాల ఆవరణను వాలంటీర్లచే శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్ తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి తిరునహరి రణధీర్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ ఎస్. ఎస్. రాజు, సుధగోని సత్యనారాయణ, వి. సదాశివ్, బి.ఎల్లయ్య, బి. వాల్య , ఎస్. వెంకట ముత్యం, సిహెచ్. విద్యాసాగర్, పి. చంద్రమోహన్, సిహెచ్ రాజిరెడ్డి, ఎస్. అశోక్, ఎం వెంకటేష్, ఏ. మమత, గ్రంథ పాలకులు ఆర్.వాసవి, శ్వేత మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →