ధర్మసాగర్, హనుమకొండ: Hindi Diwas in GJC Dharmasagar. ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్‌లో హిందీ దివస్ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆసనాల శ్రీనివాస్ సార్ మాట్లాడుతూ, భారతదేశంలో హిందీ భాషకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని అన్నారు. దేశ ప్రజలను భాషా పరంగా అనుసంధానించడంలో హిందీ కీలక పాత్ర పోషిస్తోందని, విద్యార్థులు హిందీ భాషను ప్రేమతో నేర్చుకొని తమ భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. హిందీ సాహిత్యం ద్వారా భారతీయ సంస్కృతి, విలువలు, జాతీయ సమైక్యత వంటి అంశాలను తెలుసుకోవచ్చని తెలిపారు.
Hindi Diwas in GJC Dharmasagar
ఈ సందర్భంగా హిందీ అధ్యాపకుడు షేక్ ఆజం మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్‌ను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. భారత రాజ్యాంగంలోని దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా స్వీకరించిన సందర్భంగా హిందీ దివస్‌ను జరుపుకుంటామని వివరించారు. విద్యార్థులు హిందీని కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా, జ్ఞానం మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించే భాషగా భావించాలని అన్నారు. హిందీ భాషపై ఆసక్తి పెంచుకొని, చదవడం, రాయడం, మాట్లాడటంలో నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు.
హిందీ దివస్ వారోత్సవాల సందర్భంగా కళాశాలలోని హిందీ విద్యార్థులందరికీ ఉచితంగా హిందీ స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. విద్యార్థులు ఈ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించాలని అధ్యాపకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, హిందీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో కళాశాల సిబ్బంది సహకరించారు.

