Summer holidays 2026 extended - వేసవి సెలవులు పొడిగింపు - bikki news

Summer Holidays 2026 extended – వేసవి సెలవులు పొడిగింపు

BIKKI NEWS (May 31) : Summer Holidays 2026 extended in Osmania University. ఆస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ, పాలమూరు పరిధిలోని విద్యార్థులకు మరియు విద్యా సంస్థల యాజమాన్యాలకు ఒక ముఖ్యమైన వార్త. తెలంగాణలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ (UG), పీజీ (PG) కాలేజీల వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

Summer Holidays 2026 extended in Osmania University

అలాగే కాకతీయ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కళాశాలలకు సెలవులు జూన్ 05 వరకు పొడిగించారు.

​జూన్ 6 వరకు సెలవులు పొడిగింపు

​అసలు షెడ్యూల్ ప్రకారం ఉస్మానియా, తెలంగాణ , పాలమూరు పరిధిలోని కాలేజీలకు మే 31, 2026 వరకు మాత్రమే వేసవి సెలవులు ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుత తీవ్రమైన ఎండలు మరియు వడగాల్పులను పరిగణనలోకి తీసుకుని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులను జూన్ 06, 2026 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

​కాలేజీలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయి?

​యూనివర్సిటీ విడుదల చేసిన అధికారిక సర్క్యులర్ ప్రకారం:

కాలేజీల పునఃప్రారంభం: జూన్ 08, 2026 (సోమవారం) నుండి అన్ని క్యాంపస్, కాన్‌స్టిట్యూయెంట్ మరియు అనుబంధ (Affiliated) కాలేజీలలో విద్యా కార్యకలాపాలు (Academic Activities) యథావిధిగా ప్రారంభమవుతాయి.

సెలవుల ముగింపు: జూన్ 6, 2026 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →