BIKKI NEWS : Standard GK bits in Telugu part 199
Standard GK bits in Telugu part 199
1) వర్షాకాలంలో రోడ్డుపై నూనె పొరలు రంగులలో కనిపించుటను వివరించే దృగ్విషయం ఏది.?
జ : వ్యతికరణం
2) పెరుగులో ఉండే ఆమ్లము ఏమిటి.?
జ : లాక్టిక్ ఆమ్లము
3) ఏ పద్ధతిని భూస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టింది.?
జ : శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి
4) ఏ తరహా వ్యవసాయ కమతాలు భారతదేశంలో అధికంగా ఉన్నాయి.?
జ : పరిమిత కమతాలు
5) పంట సాగుకు ఉపయోగపడే సాధారణ భూమి యొక్క పీహెచ్ విలువ ఎంత.?
జ : 6 లేదా 7
6) తిరోగమన నైరుతి రుతుపవనాల ప్రభావానికి లోను కాని రాష్ట్రం ఏది?
జ : ఒడిశా
7) గ్రీన్ గోల్డ్ అని దేనిని అంటారు.?
జ : టీ
8) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్థాపించడం వెనక గల ఉద్దేశం ఏమిటి?
జ : మేదో పరమైన హక్కులను రక్షించడం
9) జాతీయ ఉద్యానవన కృషి మిషన్ ఎప్పుడు మొదలైంది.?
జ : 2005
10) భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతిలో గణిస్తారు.?
జ : ఉత్పత్తి ఆదాయాల మదింపు పద్ధతి
11) ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధి ఏమిటి.?
జ : కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ
12) లక్డావాల కమిటీ ఏ అంశం మీద వేయబడింది.?
జ : పేదరికం అంచనా
13) సాపేక్ష పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే పద్ధతి ఏది?
జ : గిణి గుణకము మరియు లారెంజ్ కర్వ్
14) హర్షవర్ధనుడు తన రాజధానిని ఎక్కడికి మార్చాడు.?
జ : తానేశ్వర నుంచి కనూజ్
15) నీతి చంద్రిక రచయిత ఎవరు.?
జ : పరవస్తు చిన్నయ్యసూరి
16) పూరీ లోని జగన్నాథ దేవాలయ నిర్మాణ కర్త ఎవరు?
జ : అనంత వర్మ చోడ
17) ‘తోరా’ అనేది ఏ మతానికి చెందిన పవిత్ర గ్రంథం.?
జ : యూదులు
Standard GK bits in Telugu part 199
18) ప్రాచీన భారతదేశంలో అతిపెద్ద నగరం.?
జ : పాటలీపుత్రము
19);కాళిదాసు ఎవరి కాలంలో ఉన్నాడు.?
జ : రెండవ చంద్రగుప్తుడు
20) భూమిపై ఏ ప్రాంతంలో అనుకూల పరిస్థితుల వల్ల జీవవైవిద్యం ఎక్కువగా ఉంటుంది.?
జ : ఉష్ణ మండల ప్రాంతాలు
21) అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఏర్పరచిన అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది.?
జ : మజూలీ
22) ప్రపంచంలో అతిపెద్ద పరివాహక ప్రాంతం ఉన్న నది ఏది.?
జ : అమెజాన్
23);తెలంగాణలో పశ్చిమ దిశగా ప్రవహించే నది ఏది.?
జ : కాగ్నా
24) ఫేమా చట్టం ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది.?
జ : 2000
25) భారతదేశంలో మొదటి ప్రైవేటు రంగ సెజ్ ఏది.?
జ : సూరత్
26) గీత గోవిందం రచయిత ఎవరు.?
జ : జయదేవుడు
27) అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు ఏమిటి?
జ : అలీ గుర్సప్
28) బానిస వంశంలో గొప్పవాడు ఎవరు.?
జ : బాల్బన్
29) గంగా నది జల కాలుష్య నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం పేరు ఏమిటి?
జ : నమామి గంగే
30) నీటి సంరక్షణ సక్రమ పంపిణీ కోసం కేంద్రం మొదటిసారిగా జాతీయ జల విధానాన్ని ఎప్పుడు ప్రారంభించింది.?
జ : 1987

