BIKKI NEWS : Standard GK bits in Telugu part 196 – యూపీఎస్సీ , ఏపీపీఎస్సీ , టీజీపీఎస్సీ , ఎస్ఎస్సీ , డీఎస్సీ , టెట్ , బ్యాంకింగ్ , రైల్వే, పోలీస్ ఉద్యోగాల కోసం డైలీ టాప్ జీకే బిట్స్ రౌండప్.
Standard GK bits in Telugu part 196
1) ద్రవ్య బిల్లును ఇక్కడ మాత్రమే ప్రవేశపెట్టగలరు.?
జ : రాష్ట్రపతి సిఫార్సుతో లోక్సభ లో
2) ఏ రాజ్యాంగ సవరణ బిల్లు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడానికి ఉద్దేశించినది.?
జ : 123వ సవరణ
3) ‘పర్యావరణ వ్యవస్థ’ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు.?
జ : టాన్స్లే
4) ‘సునామి’ అనే పదం ఏ భాషకు సంబంధించినది.?
జ : జపనీస్
5) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు.?
జ : గవర్నర్
6) ప్రపంచ భూభాగంలో భారత భూభాగపు వంతు ఎంత.?
జ : 2.4%
7) భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధిపతి ఎవరు.?
జ : ప్రధానమంత్రి
8) ఆధునిక భూకంప శాస్త్ర పితామహుడు ఎవరు..?
జ : జాన్ మిల్నే
9) పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం కాదు అని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ఏది?
జ : బేరుబారి కేసు
10) అమెరికాలోని లిబర్టీ విగ్రహం ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం.?
జ : రాగి ఆక్సీకరణం చెందడం
11) టర్నర్ సిండ్రోమ్ లో ఉండే క్రోమోజోముల సంఖ్య.?
జ : 45
12) వండినప్పుడు ఆహారంలోనే ఏ విటమిన్ త్వరగా నష్టం అవుతుంది.?
జ : విటమిన్ సి
13) హైడ్రో ఫోబియా ఏ వ్యాధి లక్షణం.?
జ : రేబిస్
14) ఏ వ్యాధి నిర్ధారణకు రక్త నమూనాను అర్ధరాత్రి పూట సేకరిస్తారు.?
జ : ఫైలేరియా
Standard GK bits in Telugu part 196
15) అంటు రోగాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ఏపిడమాలజి
16) కాంతి సంవత్సరం దేనికి సంబంధించినది.?
జ : దూరం
17) మొదటి ఆర్గానిక్ రాష్ట్రంగా నిలిచిన రాష్ట్రం ఏది.?
జ : సిక్కిం
18) తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 2015
19) భారతదేశంలో సముద్రపు అలల శక్తి అధికంగా లభించే ప్రాంతం ఏది.?
జ : గుజరాత్ తీరం
20) తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణం దాదాపుగా.?
జ : 48%
21) కిన్నెరసాని ఏ నదికి ఉపనది.?
జ : గోదావరి
22) తెలంగాణలో విద్యుత్ శక్తికి ప్రధాన ఆధారం ఏది?
జ : థర్మల్
23) హైదరాబాదుకు నీటి సరఫరా మొట్టమొదట ఎక్కడ నుండి జరిగింది.?
జ : ఉస్మాన్ సాగర్ & హిమాయత్ సాగర్
24) తెలంగాణ ఏ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.?
జ : దక్షిణ మధ్య రైల్వే
25) మూసీ నది ఎక్కడ ఆరంభమవుతుంది.?
జ : అనంతగిరి కొండలు
26) తెలంగాణలో ఏ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు కలవు.?
జ : ఆమ్రాబాద్
27) కర్ణాటకలోని ఒక రైల్వే లైన్ వేయడంలో అడ్డుగా ఉన్న చారిత్రక కట్టడాన్ని సమర్ధవంతంగా 100 మీటర్ల అవతలకు తరలించారు ఆ కట్టడం ఏది?
జ : శ్రీరంగపట్టణంలోని టిప్పు సుల్తాన్ ఆయుధశాల
28) నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో ఎంతకాలం జైలులో ఖైదు చేయబడ్డాడు.?
జ : 27 సంవత్సరాలు
29) వాయు కాలుష్యంలో రసాయనంగా ఉండి రక్తం ఆక్సిజన్ మరియు సామర్ధ్యాన్ని తగ్గించేది ఏది?
జ : కార్బన్ మోనాక్సైడ్
30) రాత్రి దృష్టి సాధనలో ఏ తరంగాలను ఉపయోగిస్తారు.?
జ : పరారుణ తరంగాలు

