BIKKI NEWS (MAR. 23) : RO plants in Telangana Government junior colleges. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
RO plants in Telangana Government junior colleges
వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 1, 2026) నుండి ప్రారంభం కానున్న బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ పథకాలతో పాటే ఈ తాగునీటి సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
దీని కోసం ఇంటర్ బోర్డు నిధుల నుండి సుమారు రూ. 10 కోట్లు కేటాయించారు. దీనివల్ల సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి నెలవారీ మెయింటెనెన్స్ గ్రాంట్స్ ను విడుదల చేయనున్నారు.
| విద్యార్థుల సంఖ్య | గ్రాంట్ (నెలకు) |
| 30 లోపు | 3,000/- |
| 31-100 | 6,000/- |
| 101-250 | 8,000/- |
| 251-500 | 12,000/- |
| 501-750 | 15,000/- |
| 750 కంటే ఎక్కువ | 20,000/- |
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు: కాలేజీల నిర్వహణ బాధ్యతలను ఈ కమిటీలకు అప్పగించారు. టాయిలెట్ల క్లీనింగ్, మొక్కల పెంపకం వంటి పనుల కోసం రూ. 5.25 కోట్లు కేటాయించారు.
జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ : ఈ కమిటీలు 11 నెలల పాటు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పనిచేస్తాయి.
అదనపు వసతులు: డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ల్యాబ్‌ల బలోపేతం, డ్యూయల్ డెస్క్‌ల ఏర్పాటుతో పాటు లెక్చరర్లకు శిక్షణ, యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల పంపిణీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
- Annual grade increments – 2023 బ్యాచ్ డీఎల్స్ కు ఇంక్రిమెంట్ లు విడుదల చేయండి – హైకోర్టు
- University of Hyderabad jobs – హైదరాబాద్ యూనివర్సిటీలో 37 ఫ్యాకల్టీ పోస్టులు
- Today Gold Rate September 25th 2026 – బంగారం ధర
- TG cabinet meeting – అక్టోబర్ 1న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
- Today holiday districts – నేడు సెలవు ప్రకటించిన జిల్లాలు

