Probation declaration of jls .. విద్యా అర్హతల పరిశీలన తర్వాతే ప్రొబేషన్ డిక్లరేషన్ – బోర్డు

Probation declaration of jls after certificate verification only

BIKKI NEWS : Probation declaration of jls after certificate verification only. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. లెక్చరర్ల విద్యా అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విద్యార్హతల ధ్రువీకరణకు సంబంధించిన అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ఓ పత్రిక వార్తా ప్రచురించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Probation declaration of jls after certificate verification only

లెక్చరర్ల విద్యార్హతలకు సంబంధించిన అన్ని అంశాలను ధ్రువీకరించిన తర్వాతే ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత సర్టిఫికెట్లు, విద్యార్హతలకు సంబంధించిన వివరాల పరిశీలన కీలకంగా మారింది.

12 శాతం మంది లెక్చరర్ల సర్టిఫికెట్ల పరిశీలన

రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా సుమారు 12 శాతం మంది అనగా దాదాపు 360 మంది తెలంగాణ వెలుపలి విశ్వవిద్యాలయాల్లో చదివినవారి అర్హతలకు సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చాయి. సిక్కిం, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్హతలు పొందిన వారి సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. క్రమబద్ధీకరించబడిన జూనియర్ లెక్చరర్ల మీద తాము ఎలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం లేదని ఆ పత్రికకు స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఇతర రాష్ట్రాలకు అధికార బృందాలను పంపినట్లు, ఆ నివేదికలు అందిన తర్వాత ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేస్తామని తెలిపారు.

అర్హతల పరిశీలన తర్వాతే ప్రొబేషన్ డిక్లరేషన్

విద్యార్హతల ధ్రువీకరణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. 2023 లో క్రమబద్ధీకరించబడిన అ దాదాపు 3100 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సర్వీసు మూడున్నర ఇల్లు దాటిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలుమార్లు తమ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన ఇంటర్మీడియట్ బోర్డు, త్వరగా తమ ప్రొఫెషన్ డిక్లరేషన్ పూర్తి చేయాలని పలు లెక్చరర్ ల సంఘాలు ఇంటర్మీడియట్ బోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →