BIKKI NEWS : TGPSC Recruitment process completed within a month. తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే పరీక్షలకు సంబంధించి నియామకాల ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించి, పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోగానే ఎంపికలను పూర్తి చేయాలనే లక్ష్యంతో కమిషన్ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది
TGPSC Recruitment process completed within a month
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB)లో అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులు, సహాయ పర్యావరణ ఇంజినీర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల అనంతరం ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.
- అసిస్టెంట్ గ్రేడ్ పరీక్ష: అక్టోబర్ 24న పూర్తయింది.
- సహాయ పర్యావరణ ఇంజినీర్ పరీక్ష: అక్టోబర్ 26న పూర్తయింది.
- ప్రాథమిక కీ: రెండు లేదా మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది .
- అభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీపై మూడు రోజుల్లోగా అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
- తుది కీ, మెరిట్ జాబితా: అభ్యంతరాల పరిశీలన అనంతరం విడుదల చేయనున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పీసీబీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నవంబర్ రెండో లేదా మూడో వారంలో విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేయనున్నారు
నవంబర్ 6, 7 తేదీల్లో ఏఈఈ పరీక్షలు
రోడ్లు, భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులకు నవంబర్ 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.. ఈ పోస్టులకు సంబంధించిన నియామక పత్రాలను నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో అందించేందుకు కమిషన్ కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపింది.
నెల రోజుల్లోనే ఉద్యోగ నియామకాల లక్ష్యం
సాధారణంగా పరీక్షల నిర్వహణ, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల పరిశీలన, తుది కీ, మెరిట్ జాబితా, నియామక ప్రక్రియకు సమయం పడుతుంది. అయితే ఈ ప్రక్రియను వేగవంతం చేసి, పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోగా ఎంపికలను పూర్తి చేయాలని టీజీపీఎస్సీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది..

