BIKKI NEWS (OCT. 03) : NO COUGH SYRUP FOR 2 YEARS OLD CHILDREN. 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దంటూ కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
NO COUGH SYRUP FOR 2 YEARS OLD CHILDREN
ఇటీవల మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లలో దగ్గు సిరప్ ల వల్ల 11మంది చిన్నారులు మరణించారని కేంద్రం తెలిపింది.
మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా జిల్లాలోనే 9మంది చనిపోయాని. వీరిలో ఐదుగురికి ‘Coldref’, ఒకరికి ‘Nextro’ సిరప్ తాగించినట్టు తేలింది.
అయితే సంబంధించిన సిరప్ లలో కల్తీ లేదని తేలగా, వాటిల్లో వాడిన రసాయానాలు వల్లే మరణాలు సంభవించొచ్చని కేంద్రం అనుమానిస్తోంది.
దీంతో 2 సంవత్సరాల లోపు చిన్నారులకు కాఫ్ సిరప్ లను వాడోద్దని హెచ్చరించింది

