BIKKI NEWS (DEC. 20) : Mid day meals in GJC Alladurgam. ప్రభుత్వ జూనియర్ కళాశాల అల్లా దుర్గంలో శుక్రవారం నాడు విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
Mid day meals in GJC Alladurgam.
ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కే. సత్తయ్య ప్రిన్సిపాల్ గా వచ్చిన తన మొదటి నెల వేతనాన్ని 97,770 రూపాయలు ఈ కార్యక్రమానికి నడిపించుట కొరకు అందించడం జరిగింది
మరియు అధ్యాపకులు శ్యామరావు తన వంతు సహాయంగా 5000/- మరియు స్థానికులు సహకారం అందిస్తున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… పేద విద్యార్థులు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం వలన ఉదయము ఉపవాసము వచ్చి సరియైన విద్యను పొందటం లేదని గ్రహించడం జరిగిందని, విద్యార్థులు కడుపునిండా భోజనం తింటేనే చదువుకున్న విద్య అవగాహన అవుతుందని తెలిపారు. అందుకు తన వంతుగా మధ్యాహ్న భోజనం విద్యార్థుల కొరకు అధ్యాపకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంట వండటానికి కార్యాలయ సిబ్బంది హేమలత ముందుకు వచ్చారు. గతములో ప్రారoభించిన రాగి జావా ఉపహార కార్యక్రమం కొనసాగుతున్నది.
ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారం అందిస్తున్న స్థానిక అధికారులకు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల అధ్యాపకులు తుకారాం శ్యామ్ రావు రవికుమార్ రవీందర్ , నరసింహారెడ్డి, ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
