Jee main 2026 - దరఖాస్తు షురూ, నిబంధనలు ఇవే - bikki news

JEE MAIN 2026 – దరఖాస్తు షురూ, నిబంధనలు ఇవే

BIKKI NEWS (NOV. 02) : JEE MAIN 2026 NEW GUIDELINES. జేఈఈ మెయిన్ 2026 మొదటి దశ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు నవంబర్ 27 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

JEE MAIN 2026 NEW GUIDELINES

జేఈఈ మెయిన్స్ మొదటి దశ పరీక్షలు 2026 జనవరి 21 నుండి 30 వ తేదీల మధ్య నిర్వహించనున్నారు. ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు.

బీటెక్ ప్రవేశాలకు పేపర్ – 1, బీఆర్క్ ప్రవేశాలకు పేపర్ 2A, బీ ప్లానింగ్ ప్రవేశాలకు పేపర్ 2B లను విద్యార్థులు రాయాల్సి ఉంటుంది.

నూతన నిబంధనలు

దరఖాస్తు సమయంలో వెబ్ క్యామ్ ద్వారా అభ్యర్థుల ఫోటోను తీస్తారు. కావున వెబ్ క్యామ్ ఉన్న సిస్టమ్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.

ఐఐటీలు, ఎన్ఐటిలలో సీటు పొందాలంటే ఇంటర్మీడియట్ లో 75% మార్కులు సాధించి ఉండాలి.

సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి రెండిట్లోనూ ఒక తప్పుకు ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. సరైన సమాధానానికి నాలుగు మార్కులు చొప్పున కేటాయిస్తారు.

సెక్షన్ ఏ లో సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున ఛాయిస్ తో కూడిన ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ బీ లో ఎలాంటి ఆప్షన్లు లేకుండా ఐదు ప్రశ్నలు ఉంటాయి.

ఆధార్ మరియు 10వ తరగతిలో వివరాలు సరిపోవాలి. లేకుంటే ఆధార్ అప్డేట్ వెంటనే చేయించుకోవాల్సి ఉంటుంది.

ఈసారి పరీక్ష కేంద్రంలోకి మామూలు క్యాలిక్యులేటర్ ను కూడా అనుమతించరు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కావున సిస్టంలోనే క్యాలిక్యులేటర్ ఆప్షన్ ఉంటుంది.

JEE MAIN 2026 FIRST PHASE APPLICATION LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →