Intermediate Colleges Affiliation – అడ్మిషన్లు తీసుకోని 27 కళాశాలలు

Intermediate colleges affiliation

BIKKI NEWS : Intermediate Colleges Affiliation. తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు పొందడానికి 55 కళాశాలలు నకీలీ NOC పత్రాలు సమర్పించినట్లు సమాచారం. మరోవైపు 27 కళాశాలలు అడ్మిషన్లు ఈ ఏడాది చేపట్టలేదని బోర్డు కు స్వచ్చందంగా తెలిపినట్లు సమాచారం.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Intermediate Colleges Affiliation

ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సంబంధించి మొత్తం 3,241 కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ చేసింది. గత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 3,349గా ఉంది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి గుర్తింపు పొందిన కళాశాలల సంఖ్య తగ్గింది.

మరో 100 కళాశాలలకు అనుమతులు?

ప్రస్తుతం అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలలతో పాటు మరో 100 వరకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీటిలో 55 కళాశాలలు నకీలీ NOC పత్రాలు సమర్పించినట్లు సమాచారం.

అడ్మిషన్లు తీసుకోని కళాశాలలు రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్ జిల్లాలో 7, హైదరాబాద్ జిల్లాలో 6 కలవు ‌.

విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం

ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందే విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాలలో చేరే ముందు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అనుబంధ గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకోవాలి.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →