2023 batch JLs Anticident – డిసెంబర్ వరకు వెరిఫికేషన్ పూర్తి

2023 batch jls anticident

BIKKI NEWS : 2023 batch JLs Anticident verification completed upto December. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో జూనియర్ అధ్యాపకుల అర్హతలు, విద్యార్హతల ధ్రువపత్రాల పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాల్లో చేరిన వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ వరకు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా ఇంటర్మీడియట్ బోర్డు పని చేస్తోంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

2023 batch JLs Anticident verification completed upto December

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ అధ్యాపకుల నియామకాలు, విద్యార్హతల ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేసిన వారిలో కొందరు 2023 మే నెలలో ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులుగా క్రమబద్ధీకరణ పొందినట్లు సంగతి తెలిసిందే..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2000 సంవత్సరం నుంచి వివిధ దశల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేసిన వారిని ప్రభుత్వం 2023లో రెగ్యులర్ జూనియర్ అధ్యాపకులుగా మార్చింది. ఈ క్రమంలో వారి విద్యార్హతలు, సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చారు.

ఇప్పటికే 35 మందిని తొలగింపు

విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా ఇప్పటివరకు ఉద్యోగాల నుంచి 35 మందిని తొలగించిన సంగతి తెలిసిందే.

సర్టిఫికెట్ల పరిశీలనలో భాగంగా సంబంధిత విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. ధ్రువపత్రాల ప్రామాణికతను నిర్ధారించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.

ఇంకా 700 నుంచి 800 మంది వరకు సమర్పించిన విద్యార్హతల ధ్రువపత్రాల పరిశీలన మిగిలి ఉన్నట్లు సమాచారం. వీటి నిజానిజాలను నిర్ధారించేందుకు సంబంధిత విద్యాసంస్థల నుంచి వివరాలను తెప్పించే ప్రక్రియ కొనసాగుతోంది.

డిసెంబర్ వరకు వెరిఫికేషన్ పూర్తి చేయాలని లక్ష్యం

సుమారు 700–800 మంది ధ్రువపత్రాల పరిశీలన మిగిలి ఉండటంతో, ఈ ప్రక్రియను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం . సంబంధిత విద్యాసంస్థల నుంచి వివరాలు అందిన వెంటనే పరిశీలనను వేగవంతం చేయనున్నారు.

అనంతరం 2023 బ్యాచ్ జూనియర్ లెక్చరర్ల యొక్క ప్రోబెషన్ డిక్లేర్ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ప్రొబెషన్ డిక్లరేషన్ పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

SOURCE : EENADU DAILY
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →