Inter practicals and theory new syllabus

Inter Practicals and exams new scheme – నూతన ఇంటర్ ప్రాక్టికల్స్ విధానం

BIKKI NEWS (MAY 14) : Inter Practicals and exams new scheme. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం నూతన పరీక్షా విధానం మరియు పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టింది. (Download PDF file)

Inter Practicals and exams new scheme

​సైన్స్ విభాగం (Physics, Chemistry, Botany, Zoology):

ప్రాక్టికల్ పరీక్షల విధానంలో మార్పులు చేశారు. పాత పద్ధతిలో 2వ సంవత్సరంలో 30 మార్కులకు జరిగే ప్రాక్టికల్స్ బదులు, ఇప్పుడు రెండు సంవత్సరాలలో విభజించారు.

​ప్రాక్టికల్స్: మొదటి సంవత్సరం 15 మార్కులు, రెండవ సంవత్సరం 15 మార్కులు.

​థియరీ: పబ్లిక్ పరీక్షలు యధావిధిగా 60 మార్కులకు ఉంటాయి.

​గణితం (Mathematics) & హ్యుమానిటీస్:


గణితంలో మొదటిసారిగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ (ABL) మరియు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు.

​గణితం: 15 మార్కులు (1st Year) + 15 మార్కులు (2nd Year) ఇంటర్నల్స్. థియరీ పరీక్ష 75 మార్కుల నుండి 60 మార్కులకు తగ్గించారు.

​హ్యుమానిటీస్ & లాంగ్వేజెస్:

వీటికి 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఉంటుంది. థియరీ పరీక్ష 80 మార్కులకు నిర్వహించబడుతుంది.

కొత్త కోర్సు – ACE గ్రూప్ :

కామర్స్ విద్యార్థుల కోసం ACE (Accountancy, Commerce, Economics) అనే సరికొత్త గ్రూపును బోర్డు పరిచయం చేసింది. దీనికి కూడా 20 మార్కుల ఇంటర్నల్ మరియు 80 మార్కుల థియరీ విధానం వర్తిస్తుంది.

​నూతన పాఠ్యపుస్తకాలు (2026-27) :

​మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నూతన పాఠ్య పుస్తకాలను నిపుణుల కమిటీ రూపొందించింది.
​ఈ పుస్తకాల్లో డయాగ్రమ్స్, QR కోడ్స్, మరియు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (IKS) వంటి ఆధునిక అంశాలను పొందుపరిచారు. ఈ పుస్తకాల పంపిణీ జూన్ 1, 2026 లోపు పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →