BIKKI NEWS (NOV. 03) : Inter Board inspections in junior colleges . తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ , ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ బోర్డు తనిఖీలు నవంబర్ 15 వరకు చేపట్టనుంది.
Inter Board inspections in junior colleges
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1752 ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, పరిపాలనా పరమైన నిబంధనలు అమలుపరిచేందుకు ఇంటర్ బోర్డు తనిఖీలు నిర్వహించనుంది.
ఈ తనిఖీల్లో స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రటరీలు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు తమ పరిధిలోని కాలేజీలను తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఇంటర్ బోర్డు కు సమర్పించాల్సి ఉంటుది.
కళాశాలల సంస్థాగత రికార్డులు, సిబ్బంది వివరాలు, విద్యార్థుల హాజరును తప్పనిసరిగా ధ్రువికరించాలి. కళాశాలలు బోర్డు నిర్దేశించిన నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయో లేదా నిర్థారించాలి. తనిఖీ అధికారులు అన్ని కళాశాలల వివరాలను అక్కడిక్కడే అకడమిక్ మాడ్యుల్ లో సేకరించి, నమోదు చేయాలని ఇంటర్ బోర్డు సూచించింది.
- ప్రైవేటు కాలేజీల్లో అఫ్లియేషన్ ఉందా లేదా,
- విద్యార్థుల డేటా ఎంట్రీ సరిగా ఉందా లేదా,
- ప్రభుత్వ కాలేజీలు కోచింగ్ క్లాసులు నడుపుతున్నారా లేదా.
- కాలేజీలు ఏకరీతి టైం టేబుల్ ఫాలో అవుతున్నాయా లేదా,
- సిలబస్ పూర్తయిందా, లేదా
- విద్యార్థుల హాజరు ఎంత ఉంది అనేది చెక్ చేస్తారు.
- ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఇంకా 83 రోజుల సమయం ఉన్నందున యాక్షన్ ప్లాన్ రూపొందించి సిలబస్ పూర్తి చేస్తున్నారా లేదా
- స్టాఫ్ డేటా సబ్మిషన్ అయిందా లేదా,
- కాలేజీల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి,
- సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉంది.
- TG SSC EXAM DATES – తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- Holidays – విద్యా సంస్థలకు సెలవులు
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- TELANGANA HOLIDAYS 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు
- Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

