BIKKI NEWS (DEC. 26) : Gurukula inter admissions as for 10th marks. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలను పదో తరగతి మార్కులు ఆధారంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
Gurukula inter admissions as for 10th marks
గురుకుల ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు ఈసారి నిర్వహించే అవకాశాలు లేవు. కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకోనున్నారు.
ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పించమన్నారు.
అయితే మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు మాత్రం ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రవేశ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు.
ఇప్పటికే గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ మరియు 6 నుంచి 9 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 వరకు కలదు. అలాగే ఈ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22న నిర్వహించనున్నారు.

