BIKKI NEWS : Government reconsidering intermediate merger 2027. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రతిపాదనకు సంబంధించిన ఫైలు సీఎం వద్దకు చేరినట్లు సమాచారం అయితే ఈ విలీనంపై పునరాలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Government reconsidering intermediate merger 2027
ఇంటర్మీడియట్ ప్రత్యేక విద్యగా ఉండటం వలన పదో తరగతి తర్వాత డ్రాప్ అవుట్ల శాతం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ ను ప్రత్యేక విద్యగా కాకుండా పాఠశాల విద్యలో విలీనం చేయాలని ప్రతిపాదనలతో ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఆధారంగా 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఓకే విద్య దశగా ఉండాలని ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకెళ్లింది. అయితే తాజాగా పాలిటెక్నిక్ విద్య విలీనంపై వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం పై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఈ విలీనాన్ని ఇంటర్ బోర్డు ఉద్యోగులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటినీ దృష్టిలో పెట్టుకుని పైల్స్‌ను విద్యాశాఖ వద్దకు పంపారు. న్యాయశాఖ నుండి క్లియరెన్స్ తీసుకుంటున్నారు. కొద్దికాలం క్రితం ఆ ఫైలును సీఎం వద్దకు చేరి పెండింగ్‌లో ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
పాలిటెక్నిక్ విలీన జీవో పై వెనక్కి
అయితే ఇటీవలే పాలిటెక్నిక్‌ను సాంకేతిక శాఖ పరిధిలోని స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని విడుదల చేసిన జీవోపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ జీవో కి సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంటర్ విద్య పాఠశాల విలీనంపై కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

