MALBAR GOLD SCHOLARSHIP – జీజేసీ హయత్ నగర్ విద్యార్థులకు స్కాలర్ షిప్

Gjc hayat nagar

BIKKI NEWS (APRIL 23) : GJC HayatNagar students got Malbar gold scholarship. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రధానం చేయడం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చేతుల మీదుగా విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందజేశారు.

GJC HayatNagar students got Malbar gold scholarship

ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోని ఆర్టీసీ కళాభవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హయత్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థినీలకు స్కాలర్షిప్ ను మలబార్ ట్రస్ట్ వారు అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల హయత్ నగర్ రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపాల్ యన్ సంజీవరెడ్డి స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మా విద్యార్థులు స్కాలర్షిప్ కు ఎంపిక కావడానికి అన్ని విధాలుగా సలహాలు సహకారాన్ని అందించిన కళాశాల రాజనీతి శాస్త్రం అధ్యాపకులు మారం. హేమచందర్ ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు, లెక్చరర్లు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →