Ongc scholarship 2026 - ఏటా 48 వేల స్కాలర్షిప్ - bikki news

ONGC SCHOLARSHIP 2026 – ఏటా 48 వేల స్కాలర్షిప్

BIKKI NEWS (APRIL 28) : ONGC SCHOLARSHIP 2026 NOTIFICATION. ఓఎన్‌జీసీ స్కాలర్ షిప్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ స్కాలర్షిప్ కింద నెలకు 4 వేల చొప్పున సంవత్సరానికి 48 వేల రూపాయల స్కాలర్షిప్ ను కోర్సు పూర్తి చేసే వరకు అందిస్తుంది.

ONGC SCHOLARSHIP 2026 NOTIFICATION

నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉన్నత విద్య అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఓఎన్జీసీ ఈ స్కాలర్షిప్లను ప్రతి ఏటా 2000 మందికి అందిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 1000, ఓబీసీలకు 500, జనరల్ కేటగిరి అభ్యర్థులకు 500 చొప్పున స్కాలర్షిప్లను అందిస్తుంది.

అర్హతలు : ప్రస్తుత విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ మరియు పీజీ జియాలజి, జియో ఫిజిక్స్, ఎంబీఏ ఫస్టియర్ అడ్మిషన్ పొంది ఉండాలి.

అలాగే ఇంటర్ లో 60 శాతం మరియు డిగ్రీ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షలకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ లకు 4.5 లక్షలకు మించరాదు.

వయోపరిమితి : జనవరి 01 – 2025 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.

ఎంపిక విధానం : డిగ్రీ స్కాలర్షిప్ ల కొరకు ఇంటర్మీడియట్ మార్కులు, పీజీ స్కాలర్షిప్ ల కొరకు డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా కింద ఇవ్వబడిన అధికారిగా వెబ్సైట్ లింక్ లో 2026 మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : Official ONGC SCHOLARSHIPS link

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →