BIKKI NEWS (SEP. 25) : Fill up remaining gurukula jobs with pititioners. తెలంగాణ గురుకుల నియామక సంస్థ 2023లో రమారమి 9 వేల ఉద్యోగాల భర్తీలో మిగిలిన ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది.
Fill up remaining gurukula jobs with pititioners
ఈ ప్రక్రియను 6 నెలల్లోగా పూర్తి చేయాలని పేర్కొంది. ఈ ఉద్యోగాల భర్తీలో అవరోహణ క్రమం పాటించకపోవడం, మెరిట్ అభ్యర్థులు మెరుగైన పోస్టులు రావడంతో వాటిని వదిలి పెట్టడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.
ఈ ఖాళీల్లో అర్హులైన తదుపరి మెరిట్ కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయాలని ఆదేశించారు.