Dost 2026 notification -13న విడుదల - bikki news

DOST 2026 NOTIFICATION -13న విడుదల

హైదరాబాద్ (ఏప్రిల్ 12) : DOST 2026 NOTIFICATION RELEASED ON APRIL 13th. 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ ను ఏప్రిల్ 13 ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

DOST 2026 NOTIFICATION RELEASED ON APRIL 13th

ఆదివారం ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాలకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేయమన్నారు.

మొత్తం మూడు విడతలలో దోస్త్ నోటిఫికేషన్ ద్వారా అడ్మిషన్లు చేపట్టనున్నారు.

డిగ్రీ ప్రవేశాల కోసం విద్యార్థులు కచ్చితంగా దోస్త్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఇంటర్మీడియట్ మార్కులు, రిజర్వేషన్ ల ఆధారంగా ఎంపిక చేసుకున్న కళాశాలలో విద్యార్థులకు సీట్లను విడతల వారీగా కేటాయిస్తారు.

కావునా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కచ్చితంగా డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిషన్లు కావాలిసిన డిగ్రీ కళాశాలల జాబితాను ప్రాధాన్యత ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →