Degree admissions 2026 - డిగ్రీ అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.! - bikki news

DEGREE ADMISSIONS 2026 – డిగ్రీ అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష.!

హైదరాబాద్ (ఏప్రిల్ 09) : DEGREE ADMISSIONS 2026. తెలంగాణ రాష్ట్రంలో 2026 – 27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలను దోస్త్ ద్వారానే నిర్వహించే అవకాశం ఉంది. అయితే 2027 విద్యా సంవత్సరం నుండి ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

DEGREE ADMISSIONS 2026

దోస్త్ ద్వారా అడ్మిషన్లు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న మొత్తం 826 డిగ్రీ కళాశాలల్లో 70 కళాశాలలు సొంతంగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టడం ఉన్నత విద్య శాఖకు మింగుడు పడటం లేదు.

జాతీయ విద్యా విధానంలో కూడా అన్ని అడ్మిషన్లను ప్రవేశపరీక్షల ద్వారా నిర్వహించాలని ఉండడంతో దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత డిగ్రీ అడ్మిషన్లకు కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

దోస్త్ ద్వారా అడ్మిషన్లు కేవలం ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ ఆధారంగానే జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే చాలా కళాశాలల్లో ప్రవేశాలు అడ్మిషన్లు సున్నాగా ఉండటం వివిధ కోర్సుల్లో కూడా విద్యార్థులు చేరకపోవడం వంటి కారణాల 60% సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాలపై తీసుకోవాల్సిన చర్యలు, కోర్సులను ఎత్తివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు పై కూడా ప్రభుత్వం నుండి స్పష్టత కోసం ఉన్నత విద్యాశాఖ ఎదురుచూస్తోంది.

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత దోస్త్ 2026 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →