Daily gk bits in telugu part 132 - జీకే బిట్స్ - bikki news

DAILY GK BITS IN TELUGU PART 132 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART 132 – జీకే బిట్స్

DAILY GK BITS IN TELUGU PART 132

1) భారతదేశంలో అత్యధిక GSDP కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
జ : మహారాష్ట్ర

2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ ప్రారంభించబడింది.?
జ : 2007

3) తెలంగాణ వారసత్వ ప్రదేశం తోలి మసీద్ తెలంగాణలో ఎక్కడ ఉంది.?
జ : కార్వాన్

4) బృహత్కథ ఎవరి రచన.?
జ : గుణాడ్యుడు

5) తెలంగాణలో అమృత శిల ఎక్కడ లభిస్తుంది.?
జ : రామడుగు

6) 17వ శతాబ్దంలో నిర్మల్ బొమ్మలను రాజస్థాన్ కు చెందిన ఏ వంశం వారు తీసుకువచ్చారు.?
జ : నక్కాష్ కుటుంబం

7) తెలంగాణ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఎవరి పేరుతో ప్రారంభించనున్నారు.?
జ : మల్లినాధ సూరి

8) హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తూ 1953 లో వచ్చిన ప్రతిపాదనను అసెంబ్లీ ఎప్పుడు అమోదించింది.?
జ : 25 – నవంబర్ – 1955

9) తెలంగాణ రాష్ట్రంలో 610 జీవో ను ఎప్పుడు అమలు చేసింది.?
జ : 1985

10) తెలంగాణ లో అష్టసూత్రాలు ఎప్పుడు అమలు చేశారు.?
జ : 1969

11) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలు ఆరు సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రతిపాదించారు.?
జ : 1973

12) సినా ఏ నదికి ఉపనది.?
జ : భీమా

13) మదర్ థెరిసా కు ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది.?
జ : 1979

14) రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ ప్రకారం జీఎస్టీ మండలి ఏర్పాటు అయింది.?
జ : 279 (A)

15) ఐక్యరాజ్య సమితి భారత ప్రతిపాదన ప్రకారం ఏ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించింది.?
జ : జూన్ 21

16) అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 17

17) అంతర్రాష్ట్ర మండల స్థాయి సంఘం ఏ కేంద్ర మంత్రి అధ్యక్షతన జరుగుతుంది.?
జ : కేంద్ర హోం శాఖ మంత్రి

18) సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ ఏ నగరంలో ఉంది.?
జ : హైదరాబాద్

19) ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు ఎవరు .?
జ : శ్రీశ్రీ రవిశంకర్

20) దేశంలో తొలిసారిగా 1,000 రూపాయలు 10,000 రూపాయల కరెన్సీ నోట్లను ఏ సంవత్సరంలో ఉపసంహరించారు.?
జ : 1946

21) అగ్ని – 1 క్షిపణి పరిధి ఎంత.?
జ : 700 కిలోమీటర్లు

22) భారతీయులకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని 1911లో బ్రిటిష్ వారికి ప్రతిపాదించిన భారతీయుడు ఎవరు.?
జ : గోపాలకృష్ణ గోకలే

23) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 (2) (B) ప్రకారం హిందువులు అంటే.?
జ : అందరూ

24) భారత రాజ్యాంగం ఒక చేతితో హక్కులను ప్రసాదించి, మరొక చేతితో వాటిని వెనకకు తీసుకుంది. అని ఎవరు వ్యాఖ్యానించారు.?
జ : నార్మల్ డి ఫార్మర్

25) ఏ ఆర్టికల్ పేదలకు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించాలని నిర్దేశించింది.?
జ : ఆర్టికల్ 39 (A)

26) జాతీయ గీతం జనగణమనను బహిరంగంగా ఆలపించాలని ఒత్తిడి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని, మౌనంగా ఉండటం కూడా భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొన్నది.?
జ : బిజోయ్ ఇమ్మాన్యూయోల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →