BIKKI NEWS (NOV. 15) : ICAR technical assistant recruitment 2026. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) పరిశోధనా సంస్థలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల్లో (KVKs) 1393 ఉద్యోగాల భర్తీకి అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) అధికారిక నోటిఫికేషన్ (F. No. 2(2)/2025-Exam) విడుదల చేసింది. సెంట్రలైజ్డ్ కంబైన్డ్ ఎగ్జామినేషన్-2026 ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ICAR technical assistant recruitment 2026
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించేందుకు ఇది ఒక సువర్ణావకాశం. ఇంటర్వ్యూ లేకుండా కేవలం రాత పరీక్షల ద్వారానే ఎంపిక ప్రక్రియ జరగనుంది.
ఖాళీల వివరాలు
- టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant – T-3): 1,254 పోస్టులు
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (Senior Technical Assistant – T-4): 139 పోస్టులు
దరఖాస్తు గడువు విధానం
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు నవంబర్ 18 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..
అర్హతలు
అభ్యర్థులు డిసెంబర్ 17, 2026 నాటికి సంబంధిత విభాగంలో (అగ్రికల్చర్ / హార్టికల్చర్ / వెటర్నరీ సైన్స్ / ఫిషరీస్ / హోమ్ సైన్స్ / బయోటెక్నాలజీ / ఐటీ / లైబ్రరీ సైన్స్) బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్‌షాప్ స్టాఫ్ (ఇంజనీరింగ్ విభాగం) పోస్టులకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్ (B.Tech/B.E) లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.
వయోపరిమితి (Age Limit)
డిసెంబర్ 17, 2026 నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు (PwBD) 10 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
వేతన వివరాలు
- టెక్నికల్ అసిస్టెంట్ : 48,000 – 54,000 వరకు
- సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ : 58,000 – 65,000 వరకు
ICAR technical assistant recruitment 2026
దరఖాస్తు రుసుము (Application Fee)
- జనరల్ (UR) అభ్యర్థులు: ఒక పోస్టుకు రూ. 300 (T-3 & T-4 రెండింటికీ కలిపి రూ. 600).
- OBC / EWS అభ్యర్థులు: ఒక పోస్టుకు రూ. 150 (రెండింటికీ కలిపి రూ. 300).
- SC / ST / PwBD / మహిళలు / ట్రాన్స్‌జెండర్ / ఎక్స్-సర్వీస్‌మెన్: ఎలాంటి ఫీజు లేదు (ఉచితం).
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ 18 – 2026
- దరఖాస్తు గడువు : డిసెంబర్ 17 – 2026
- దరఖాస్తు ఎడిట్ అవకాశం : డిసెంబర్ 18 నుంచి 20
- ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 2027 ఫిబ్రవరి నెలలో ఉంటుంది.
OFFICIAL WEBSITE LINK

