BIKKI NEWS : DAILY GK BITS 42 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 42 FOR COMPITITIVE EXAMS
1) ఉక్రెయిన్ నుండి భారత పౌరులను వెనక్కి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ గంగా
2) భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : వారన్ హెస్టింగ్స్
3) అంతర్జాతీయ డార్విన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 12
4) సౌర వ్యవస్థలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహంగా ఏ గ్రహం రికార్డులకు ఎక్కింది.?
జ : గురు గ్రహం (92)
5) ఇనుము తుప్పు పట్టకుండా కాపాడే ప్రక్రియను ఏమని అంటారు.?
జ : గాల్వనైజేషన్
6) హెర్బల్ ఇండియన్ డాక్టర్ అని ఏ మొక్కకు పేరు.?
జ : ఉసిరి
7) నోబెల్ బహుమతులను మొట్టమొదటిసారి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు.?
జ : 1901
8) పుల్టిజర్ బహుమతి ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి అందజేస్తారు.?
జ : సాహిత్యం మరియు జర్నలిజం
9) భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా విదేశాంగ శాఖ మంత్రి ఎవరు?
జ : సుష్మా స్వరాజ్
10) తెలంగాణ రాష్ట్రంలో దిండి రిజర్వాయర్ ఏ నదిపై నిర్మించబడింది.?
జ : కృష్ణా నది
11) ప్రఖ్యాత కవి గుల్జార్ రచించిన గ్రీన్ పోయమ్స్ ను తెలుగులోకి అనువదించినది ఎవరు?
జ : వారాల ఆనంద్
12) అబుల్ హాసన్ తానిషా కు ఆ పేరు పెట్టిన సూపి మత గురువు పేరేమిటి.?
జ : సారాజు ఖత్తాల్
13) అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కథా సంకలనాన్ని ఎవరు వెలువరించారు.?
జ : పసునూరు రవీందర్
14) చలి/చల్లని అనే పదాలను తెలంగాణ మాండలికంలో ఎలా ఉపయోగిస్తారు.?
జ : ఇగం
15) ఆగస్టు 2005లో నియమించబడ్డ రెండవ పరిపాలన సంస్కరణ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు.?
జ : వీరప్ప మొయిలీ
16) భారత రాజ్యాంగం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఎవరిని రాజ్యాంగ పనితనాన్ని సమీక్షించడానికి జాతీయ కమిషన్ చైర్మన్ గా నియమించింది.?
జ : జస్టీస్ వెంకటాచలయ్య
17) పౌరసత్వ (సవరణ) చట్టం 2015 – భారతీయ మూలానికి చెందిన కొన్ని వర్గాల వ్యక్తులకు ఒక కొత్త రకం పౌరసత్వాన్ని ప్రవేశపెట్టింది దానిని అధికారికంగా ఏమంటారు.?
జ : ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్
18) స్వరాజ్య పత్రిక స్థాపించినది ఎవరు.?
జ : గాడిచర్ల హరిసర్వోత్తమరావు
19) వివేకవర్ధిని పత్రిక స్థాపించినది ఎవరు?
జ : కందుకూరి వీరేశలింగం
20) మతపరమైన నియోజకవర్గాల ఏర్పాటుకు ఏ చట్టం ద్వారా బ్రిటీష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది.?
జ : 1909 చట్టం
21) వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంది?
జ: ఉత్తరాఖండ్
22) ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా
జ :గంగా-బ్రహ్మపుత్ర డెల్టా
23) దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు?
జ: కావేరి
24) రాజ్యాంగంలో ఏ ప్రాథమిక హక్కు భారతీయులు కానప్పటికీ వర్తిస్తుంది.?
జ : ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కు
25) జాతీయ భద్రతా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 4
26) ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 3
27) పల్లవ రాజ్య వంశ స్థాపకుడు ఎవరు.?
జ : సింహ విష్ణువు
28) బాదామి చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు.?
జ : పులకేశి – 1
29) వేంగి చాళుక్య వంశ స్థాపకుడు ఎవరు.?
జ : విష్ణు వర్దనుడు
30) 1875వ సంవత్సరంలో ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి ఏ నగరంలో ప్రారంభించాడు.?
జ : బొంబాయి
- Top current affairs in Telugu 30th September 2026
- Today top current affairs in Telugu 29th September 2026
- Free scooties for inter Students – ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్కూటీలు
- Today Gold Rate September 30th 2026 – పెరిగిన బంగారం ధర
- Free coaching – ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఉచిత కోచింగ్

