BIKKI NEWS (NOV. 13) : BSc Agriculture admissions Counselling on November 17 to 19th. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు అగ్రికల్చరల్ కళాశాలల్లో బిఎస్సి అగ్రికల్చర్ సీట్లు భర్తీ చేయడానికి కౌన్సిలింగ్ షెడ్యూల్ ను ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
BSc Agriculture admissions Counselling on November 17 to 19th
నవంబర్ 17,18, 19వ తేదీలలో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. ఒక్కో కళాశాలకు 30 సీట్ల చొప్పున 90 సీట్లను భర్తీ చేయనున్నారు.
హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లలో ఈ నూతన కళాశాలలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
హుజూర్ నగర్ వ్యవసాయ కళాశాలలో సీటు పొందిన తొలి విద్యార్థికి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కౌన్సిలింగ్ కు హాజరై అడ్మిషన్ లెటర్ ను అందజేయనున్నారు.
యూనివర్సిటీ పరిధిలో మిగిలిన బీఎస్సీ అగ్రికల్చరల్ ప్రత్యేక సీట్లను నవంబర్ 20, 21వ తేదీలలో జరిగే ప్రత్యేక కౌన్సిలింగ్ లో కేటాయించనున్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 అగ్రికల్చర్ కళాశాలలో గురుకుల కోటా కింద అడ్మిషన్ల కోసం నవంబర్ 14న కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
వెబ్సైట్ :https://www.pjtau.edu.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
