BIKKI NEWS : CURRENT AFFAIRS AUGUST 14th 2025 – కరెంట్ అఫైర్స్
CURRENT AFFAIRS AUGUST 14th 2025
1) క్రిసిల్ సంస్థ అంచనాల ప్రకారం 2025-26లో భారత ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు కానుంది.?
జ : 3.5%
2) ఎస్ & పీ అంచనా ప్రకారం భారత జిడిపి వృద్ధిరేటు 2025 – 26 లో ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6.5%
3) ఇస్రో సంస్థ ‘బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్’ ను ప్రయోగించడానికి ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది.?
జ : అమెరికా
4) తాజాగా ఏ రెండు దేశాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి.?
జ : అజర్ బైజాన్ – ఆర్మేనియా
5) దేశంలో ఎక్కడ మొట్టమొదటి స్టెమ్ సెల్ బయో బ్యాంక్ అండ్ లాబరేటరీ ప్రారంభించారు.?
జ : హైదరాబాద్
6) ఫిచ్ సంస్థఅంచనా ప్రకారం భారత జిడిపి వృద్ధిరేటు 2025 – 26 లో ఎంతగా నమోదు కావచ్చు.?
జ : 6.3%
7) జూలై 2025 లో రీటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 1.55%
8) భారతదేశంలో సురక్షితమైన నగరాల జాబితాలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది?
జ : మంగుళూరు
9) ఆగస్టు 24, 25 తేదీల్లో జరగనున్న ఆల్ ఇండియా స్పీకర్స్ సదస్సుకు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆతిధ్యం ఇస్తుంది.?
జ : న్యూఢిల్లీ
10) పాలస్తీనా సార్వభౌమత్వం నుఏ దేశం తాజాగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.?
జ : ఆస్ట్రేలియా
11) భారతీయ రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ లో టికెట్ రేటులో ఎంత శాతం డిస్కౌంట్ ప్రకటించింది.?
జ : 20 శాతం
12) సోలార్ పవర్ తో నడవనున్న మొట్టమొదటి అసెంబ్లీగా ఏ అసెంబ్లీ నిలిచింది .?
జ : న్యూఢిల్లీ
13) దేశంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు.?
జ : బొమ్మసాండ్రా బెంగళూరు

