జీజేసీ సంగెం మధ్యాహ్న భోజనానికి విరాళం - bikki news

జీజేసీ సంగెం మధ్యాహ్న భోజనానికి విరాళం

  • BIKKI NEWS : 29-01-2026

Donation for mid day meals in GJC Sangem. సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి, మధ్యాహ్నం భోజనానికి శ్రీ కొప్పుల గంగాధర్ రావు 25,000/- వేల భారీ విరాళం అందించారు.

Donation for mid day meals in GJC Sangem.

చింతలపల్లి వాస్తవ్యులు, సేవాదృక్పథం గల శ్రీ కొప్పుల గంగాధర్ రావు గారు తన తల్లిదండ్రులు నేర్పిన సంస్కారంతో సమాజానికి అండగా నిలుస్తున్నారు. సంగెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులపై ఆయన చూపుతున్న ఆదరణ ఎంతో అభినందనీయం. గత విద్యా సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకానికి అపారమైన సహాయం అందించి ఎంతోమంది విద్యార్థుల ఆకలి తీర్చిన గంగాధర్ రావు గారు, ఈ ఏడాది కూడా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కళాశాల యాజమాన్యం విన్నపాన్ని మన్నించి, మధ్యాహ్న భోజన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేందుకు ₹25,000 (ఇరవై ఐదు వేల రూపాయల) నగదును విరాళంగా అందజేశారు.

​ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కాక మాధవరావు గారు మరియు అధ్యాపక బృందం ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గంగాధర్ రావు గారి ఆర్థిక సాయం పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎంతో తోడ్పడుతుందని, ఆయన ఔదార్యం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విజయనిర్మల, బుచ్చిరెడ్డి, రాజ్ కుమార్, ప్రభాకర్, ఆనంద్, కుమారస్వామి, నాగరాజు, అనిల్, యక సాయిలు,కుమారస్వామి, మాధవి, చిరంజీవి, రాఖీ, సుధీర్ కుమార్, సదయ్య, రమ, పద్మ, లక్ష్మి, సంగీత, సమ్మయ్య తదితరులు పాల్గొని గంగాధర్ రావు గారికి అభినందనలు తెలియచేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →