BIKKI NEWS: CURRENT AFFAIRS AUGUST 8th 2025 – కరెంట్ అఫైర్స్ ఆగష్టు 08
CURRENT AFFAIRS AUGUST 8th 2025
1) హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద తమిళనాడులో 4-లేన్ల మరక్కనం-పుదుచ్చేరి (NH-332A) హైవేను నిర్మించడానికి కేంద్ర మంత్రివర్గం ఎంత ఖర్చును ఆమోదించింది?
జ: ₹2,157 కోట్లు
2) దేశీయ LPGపై జరిగిన నష్టాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు కేంద్ర మంత్రివర్గం ఎంత పరిహారం ఆమోదించింది?
జ: ₹30,000 కోట్లు
3) ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY) కోసం ₹6,520 కోట్ల బడ్జెట్‌ను ఎవరు ఆమోదించారు?
జ: కేంద్ర మంత్రివర్గం
4) ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమి (ISA)లో 107వ సభ్యదేశంగా చేరింది?
జ: మోల్డోవా
5) ఇటీవల షీలీడ్స్ II కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
జ: అన్నపూర్ణ దేవి
6) కాశ్మీర్ లోయలో వస్తువుల రవాణాకు వీలు కల్పించిన మొదటి రైల్వే స్టేషన్ ఏది?
జ : అనంతనాగ్ రైల్వే స్టేషన్
7) కొత్త ఇన్క్రెడిబుల్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫామ్ (IIDP) ను ఎవరు ప్రారంభించారు?
జ : పర్యాటక మంత్రిత్వ శాఖ
8) ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 2025–26 వరకు ఎంత సబ్సిడీని కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది?
జ : ₹12,000 కోట్లు
9) ప్రపంచంలోనే అత్యంత అరుదైన రక్త గ్రూపు CRIB ఇటీవల ఏ దేశంలో కనుగొంది.?
జ : భారతదేశం
10) అంతర్జాతీయ సౌర కూటమిలో ఏ దేశం 7వ స్థానంలో లేదు.?
జ : మోల్డోవా
11) భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే మొదటి శాసనసభ ఏది.?
జ : న్యూఢిల్లీ
12) సామర్థ్య నిర్మాణ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఎస్. రాధా చౌహాన్

