Accidental insurance – ఉద్యోగులకు 1.02 కోట్ల ప్రమాద బీమా – భట్టి విక్రమార్క

1. 02 crore insurance for telangana government employees

BIKKI NEWS (JAN. 09) : 1.02 crore accidental insurance to . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

1.02 crore accidental insurance to telangana government employees

రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా అమలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో నిర్వహించిన సంప్రదింపులు విజయవంతమయ్యాయని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులను మా కుటుంబ సభ్యులుగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గత ప్రభుత్వంలో ఏర్పడిన బకాయిలను సైతం ప్రతి నెల క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తూ వస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →