BIKKI NEWS (JAN. 08) : Rangavalli compitition in gjc girls Jangoan. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల జనగామ నందు గురువారం కళాశాల విద్యార్థులకు సంక్రాంతి పండగను పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ శీకటి సునంద అధ్యక్షతన జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ నలమాస సునీత ఆధ్వర్యం లో రంగవల్లుల పోటీలు నిర్వహించారు.
Rangavalli compitition in gjc girls Jangoan.
ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల ముగ్గులను వేశారు. ప్రకృతి, రైతులు, భారత దేశ అభివృద్ధి,మహిళా భద్రత,దేశ సైనికులను ఉద్దేశించి వివిధ రకాల రంగవల్లులను కళాశాల విద్యార్థులు తీర్చిదిద్దారు.
భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబించే విధంగా రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ పోటీలలో దేశానికి రైతు మరియు సైనికుడు ప్రాధాన్యతను ప్రతిబింబించే రంగవల్లి కి ప్రధమ బహుమతి లభించింది.
ద్వితీయ బహుమతిగా సేవ్ ఎర్త్ సేవ్ వాటర్ రంగవల్లి కి, తృతీయ బహుమతిగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతి రంగవల్లి కి దక్కింది.
ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
