Today in history August 5th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 05

Today in history august 5th - చరిత్రలో ఈరోజు ఆగస్టు 05 - bikki news

BIKKI NEWS : Today in history August 5th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 05

Today in history August 5th

సంఘటనలు

1100: హెన్రీ I, వెస్ట్ మినిష్టర్ అబ్బే లో, ఇంగ్లాండ్ రాజుగా పట్టాభిషిక్తుడయాడు.
1583: సర్ హంఫ్రీ గిల్బర్ట్ మొట్టమొదటి ఆంగ్లేయుల వలస ను, ఉత్తర అమెరికా లో, నెలకొల్పాడు. ఆ ప్రాంతాన్నిన్యూపౌండ్‌ లాండ్ లోని సెయింట్ జాన్ గా పిలుస్తున్నారు.
1624: విలియమ్ జేమ్స్‌టౌన్, ఆంగ్లేయులు ఆక్రమించిన (వర్జీనియా, అమెరికా) లో పుట్టిన మొదటి నీగ్రో.
1845: ఆస్ట్రేలియా లోని ‘కింగ్ ఐలేండ్’ ద్వీపానికి దగ్గరలో జరిగిన ఘోరమైన ఓడ (పేరు: కేటరక్వి) ప్రమాదంలో, 407 మంది మరణించారు.
1858: మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేసారు.
1861: అమెరికా సైనిక దళాలు, ‘సైనికులను కర్రలతో ఒక పద్ధతిగా చావబాదే’ శిక్షను రద్దు చేసింది. (క్రమశిక్షణను పాటించని కొందరి సైనికులకు ఈ శిక్ష విధించేవారు) .
1861: అమెరికా మొట్టమొదటి సారి ఆదాయపు పన్నును విధించింది. (800 డాలర్ల ఆదాయం దాటితే 3% పన్ను చెల్లించాలి)
1864: తోకచుక్క వర్ణపటలము (సూర్యకాంతి ఏడురంగులను వర్ణపటలము అంటారు) ను మొదటిసారిగా చూసిన శాస్త్రవేత్త జియోవన్ని దొనాతి
1874: ఇంగ్లాండ్లో ఉన్న పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ఆదర్శంగా తీసుకుని, జపాన్ తన సొంత పోస్టల్ సేవింగ్స్ సిస్టంని ప్రవేశపెట్టింది.
1879: రాత్రి సమయంలో మొట్టమొదటిసారిగా, ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ‘గ్యాస్ లైట్ల’ వెలుతురులో క్రికెట్ ఆడారు.
సం. 1882: స్టీలుతో తయారయిన యుద్ధనౌకలను, అమెరికా నౌకాదళంలో వాడటానికి అమెరికా అనుమతించి, ఆధునిక నౌకాదళానికి నాంది పలికింది.
1882: మార్షల్ లా (సైనిక దళాల న్యాయం), జపాన్లో చట్టమయ్యింది.


సం. 1882: స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని అమెరికాలో స్థాపించారు.
1882: స్టేట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి, బెడ్లోస్ ఐలేండ్ (న్యూయార్క్ హార్బర్) శంకుస్థాపన జరిగింది. ఆ సమయంలో వర్షం కురుస్తున్నది.

1900 సంఘటనలు


1905: నార్వే దేశం, స్వీడన్ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది.
1912: జపాన్ లోని టోక్యో నగరంలోని “గింజా” అనే చోట, మొట్టమొదటి సారిగా టాక్సి కేబ్ (అద్దె కారు- టాక్సీలు) లు ప్రారంభించారు.
1914: మొదటి ప్రపంచ యుద్ధంలో, జర్మనీ దేశం, సోవియట్ యూనియన్ దేశం, మీద యుద్ధం ప్రకటించినప్పుడు, అమెరికా తనను తాను, తటస్థ దేశంగా ప్రకటించుకున్నది.
1914: అమెరికా లోని ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లేండ్ నగరంలో మొట్టమొదటి ట్రాఫిక్ లైట్లు ప్రారంభించారు.
1923: ఇంగ్లీష్ ఛానెల్ని ఈదిన మొదటి అమెరికా ఈతగాడు హెన్రీ సల్లివాన్
1962: నెల్సన్ మండేలాని నిర్బంధించి, చెఱ (ర) సాలలో బంధించారు.
1963: ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి
1963: అమెరికా, ప్రయోగించిన రోదసీ నౌక, మారినర్-7, మొట్టమొదటి సారి, కుజగ్రహం చిత్రాలను, ప్రసారంచేసింది.
1973: ఇద్దరు ఆరబ్ తీవ్రవాదులు, ఏథెన్స్ లోని విమానాశ్రయంలో గుంపుగా ఉన్న ప్రయాణీకుల మీద కాల్పులు జరపగా, ముగ్గురు మరణించగ, 55 మంది గాయపడ్డారు.
1984: జోన్ బెనోయిట్, స్త్రీల మొదటి ఒలింపిక్ మారథాన్ గెలుచుకున్నది.

జననాలు

1896: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990)
1862: జోసెఫ్ కేరీ మెర్రిక్, ఏనుగు-మనిషి ఆకారంలో పుట్టిన వ్యక్తి. 27 సంవత్సరాలు బ్రతికాడు. (మరణం ఏప్రిల్ 11, 1890) .
1908: చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (మ.1975)
1930: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (మ.2012)
1989: డా: ముప్పిడి రవి, సంఘ సేవకుడు మరియు పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ నిర్మాతలలో ఒకరు
1948: వడ్డేపల్లి కృష్ణ, కవి ,లలిత గీతాలు, గేయ రచయిత,(మ.2024).
1950: ప్రేమ్ వాత్స, భారతీయ-కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త.
1974: కాజోల్, భారతీయ సినీ నటి.
1980: ఉదయ భాను, టెలివిజన్ యాంకర్, చలన చిత్ర నటి.
1985: మమతా మోహన్ దాస్, సినీ నటి, నేపథ్య గాయని.
1987: జెనీలియా, తెలుగు,తమిళ,కన్నడ, హిందీ చిత్రాల నటి.
1996:ఆషికా రంగనాథ్ , తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల నటి.

మరణాలు

1895: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (జ.1820)
1950: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890)
1962: మార్లిన్ మన్రో, ప్రముఖ హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (జ.1926)
1991: సొయిఛిరో హోండా, హోండా కంపెనీ స్థాపకుడు., కాలేయ కేన్సర్ తో 84వ ఏట మరణించాడు (జ.1906)
1984: రిచర్డ్ బర్టన్, హాలీవుడ్ నటుడు, తన 58వ ఏట మరణించాడు (జ.1925 నవంబరు 10)
1997: బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922)
2022: భీమపాక భూపతిరావు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →