కళ్ళెం/జనగాం (డిసెంబర్ 30) : Mabbu Parashuram donate free material for 10th class students. కళ్ళెం హైస్కూల్ లో ప్రధాన ఉపాధ్యాయులు యాదగిరి అధ్యక్షతన 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దాత, దళిత రత్న అవార్డు గ్రహీత మబ్బు పరశురామ్ గారి సూచన మేరకు స్టడీ మెటీరియల్ జై భీమ్ ఫౌండేషన్ – కళ్ళెం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.
Mabbu Parashuram donate free material for 10th class students
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి గారు మాట్లాడుతూ… విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగించుకొని బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, గ్రామానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే అధిక మార్కులు సాధించిన విద్యార్థికి ఉన్నత విద్య కొరకు 5,000/- ప్రోత్సాహకంగా పరశురామ్ గారు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు మబ్బు విజయ్, ఉపాధ్యక్షుడు మబ్బు రావణ్, ఉప సర్పంచ్ ఆరె సంపత్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు, వార్డు మెంబర్ మబ్బు క్రాంతి కుమార్, MRPS గ్రామ శాఖ అధ్యక్షుడు మబ్బు కన్నయ్య, వార్డు సభ్యులు మబ్బు కళమ్మ సత్తయ్య, కొత్తపేట బాలమణి భాస్కర్, యువజన నాయకులు నక్కీర్త మహేష్, అజయ్, అనిల్, కన్నా, నవీన్, మహేందర్, చరణ్, యేసు మరియు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఫౌండేషన్ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Daily current affairs in Telugu 4th June 2026 – డైలీ కరెంట్ అఫైర్స్
- TGPSC Deputy EO job notification 2026 – డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్
- Today Gold Rate June 5th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TGPSC – మరో 1597 ఉద్యోగాలకు ఈనెలలో నోటిఫికేషన్ – వివరాలు
- TGCET 2026 2nd Phase Result – గురుకుల ఐదో తరగతి 2వ జాబితా
